నిజామాబాద్ నగరంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్‌ఛార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కర్ణ శ్రీనివాస్‌రావు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారుల చిక్కాడు.
వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుని వి.ఎల్.టి. ఫైల్ ప్రాసెస్ చేసి నంబర్ కేటాయించడంలో సహాయం చేస్తానని, అలాగే భవిష్యత్తులో దుకాణం సజావుగా నడిచేలా చూసుకుంటానని హామీ ఇస్తూ, రూ.10,000 లంచం డిమాండ్ చేసాడు. చివరికి అభ్యర్థన మేరకు రూ.7,000 అంగీకరించి లంచం తీసుకుంటున్న సమయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను పట్టుకున్నారు.
ప్రజలకు ఎసిబి అధికారులు విజ్ఞప్తి చేస్తూ, ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేయాలని సూచించారు. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.