ఏసీబీ వలలో వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి

వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారిని లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేసిన అనిశా అధికారులు

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల వ్యవసాయ అధికారి భూపతి జయశంకర్ లంచం తీసుకుంటూ అనిశా (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు పట్టుబడ్డారు.

ఓ ఎరువుల డీలర్ కు చెందిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణానికి లైసెన్స్ జారీ చేయడంలో సహాయం చేయడానికి భూపతి జయశంకర్ మొదటగా రూ.1,00,000/- లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ మొత్తంలో రూ.50,000/- స్వీకరిస్తూ ఉన్న సమయంలో అనిశా అధికారులు అతడిని పట్టుకున్నారు.

ప్రజలకు అనిశా అధికారులు విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వ సేవకులు లంచం కోరినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయాలని తెలిపారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు.

అదే విధంగా, ఫిర్యాదుదారుల మరియు బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అనిశా స్పష్టం చేసింది.


Share this post

7 thoughts on “ఏసీబీ వలలో వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి

  1. Does your site have a contact page? I’m having problems locating it but, I’d like to send you an email. I’ve got some recommendations for your blog you might be interested in hearing. Either way, great website and I look forward to seeing it expand over time.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం