హైదరాబాద్ నార్సింగి పురపాలక సంఘంలోని పట్టణ ప్రణాళిక శాఖ అధికారిణి ఎస్. మణి హారిక లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారునికి చెందిన బహిరంగ ప్లాట్ క్రమబద్ధీకరణ (LRS) కోసం అవసరమైన ప్రొసీడింగ్‌లను జారీ చేయడంలో సహాయం చేస్తానని చెప్పి, మొదట రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆమె, అందులో రూ.4 లక్షలు స్వీకరిస్తున్న సమయంలో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులకు పట్టుబడిన తర్వాత ఈ అధికారిని ఏడుపే ఏడుపు.
అవినీతి నిరోధక శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయాలని సూచించింది. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది.
ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ACB అధికారులు హామీ ఇచ్చారు.