వనపర్తి జిల్లా, కొత్తకోట మండల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సి.వాసు, మండల సర్వేయర్ జి.నవీన్ రెడ్డి లు ఫిర్యాదుదారుని నుండి రూ.40,000 లంచం డిమాండ్ చేసిన ఘటన లో ఏసీబీ కేసులు నమోదు చేశారు.
ఫిర్యాదుదారుని బంధువుల భూమికి సంబంధించిన విచారణ జరిపి, పంచనామా నివేదికను సిద్ధం చేసి, ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ (ORC) జారీ చేయడం కోసం అధికారిక సహాయం చేస్తామని చెప్పి లంచం డిమాండ్ చేసినట్లు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
“ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు డయల్ చేయండి. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు తెలిపారు.”
లంచం డిమాండ్ చేసిన రెవిన్యూ సిబ్బంది పై కేసు
