ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు, అన్వేష్‌పై కేసు

anvesh

హైదరాబాద్: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు అన్వేష్‌పై కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్ రాజ్‌లతో సహా పలువురు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారని ఆరోపిస్తూ అన్వేష్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అవాస్తవ, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సైబర్ క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, అన్వేష్ విడుదల చేసిన వీడియో ప్రజల్లో గందరగోళం సృష్టించడం, ప్రభుత్వ అధికారులు మరియు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేలా రూపొందించబడిందని ఆరోపించారు. ఈ వీడియో అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వంపై వ్యతిరేకత ఈంకా ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా తయారు చేయబడిందని ఫిర్యాదులో తెలిపారు. ఈ నేపథ్యంలో అన్వేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.

వందలు వేలు అలక్షల కోట్ల బెట్టింగ్ యాపుల ప్రమోషన్లో బడాకార్పోరేట్ కంపెనీలు బిగి సెలబ్రటీలు ఉన్నారని ఇందులో యవకులు బలవుతున్నారని అన్వేషి గతకొన్ని రోజులుగా తనయూటూబ్ ఛానెల్ ద్వారా అవేర్ నెస్ కాంపేయిన్ చేస్తున్నాడు. అంతేకాదు బెట్టింగ్ యాపుల పై వీడియోలు చేస్తూ వాటి ద్వారా వ్చచిన ఆదాయం బెట్టింగ్ యాపుల కారణంగా చనిపోయిన యువకుల కుటుంబాలకు అందచేస్తానని అన్వేషి ప్రకటించాడు. బెట్టింగ్ యాపుల పై అన్వేషి ఎవరిని వదలడం లేదు. సెలెబ్రటీలను బడా కార్పోరేట్ కెంపీనలను అట్లాగే ఇందులో ఇన్ వాల్వ్ అయిన క్రికెట్ స్టార్స్ పేర్లు కూడ వీడియోలలో ప్రస్తావించారు.

నెట్లో అందుబాటులో ఉన్న సమాచారంమేరకు అన్వేషి కుటుంబ నేపద్యం విశాఖపట్నం. అన్వేష్ అలియాస్ చిన్ని , సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మొదట్లో తన వృత్తిని ప్రారంభించాడు, కానీ ప్రయాణాల పట్ల మక్కువతో యూట్యూబ్ ఛానెల్‌ను స్థాపించాడు. ఆయన ఛానెల్ “Anvesh Around the World” పేరుతో ప్రసిద్ధి చెందింది,

అన్వేష్ గత 5-6 సంవత్సరాలుగా (2019 నుంచి) ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానెల్‌ను 2018లో ప్రారంభించినప్పటికీ, 2019 నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణ వీడియోలపై దృష్టి సారించాడు. ఈ కాలంలో ఆయన ఆంటార్కిటికా, ఆఫ్రికా, యూరప్, ఆసియా వంటి ప్రాంతాలను సందర్శించాడు. ఆంటార్కిటికా యాత్రకు తెలుగు యూట్యూబర్‌లలో మొదటివాడిగా గుర్తింపు పొందాడు.

ఆయన ఛానెల్ కు2.11 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. వీక్షకులైతే ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో ఉన్నారు. ప్రతినెలా యూట్యూబ్ వీడియోల ద్వారా యాడ్సెన్స్ ఆదాయం లక్షల్లో వస్తుంటుంది.

Share this post

11 thoughts on “ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు, అన్వేష్‌పై కేసు

  1. Hmm is anyone else encountering problems with the pictures on this blog loading? I’m trying to figure out if its a problem on my end or if it’s the blog. Any responses would be greatly appreciated.

  2. Hello very cool site!! Man .. Beautiful .. Superb .. I’ll bookmark your site and take the feeds additionally…I am happy to seek out numerous helpful information right here in the submit, we want develop extra techniques on this regard, thanks for sharing.

  3. I believe that is among the such a lot vital information for me. And i’m glad reading your article. But should observation on some normal things, The website style is wonderful, the articles is truly great :D. Just right job, cheers

  4. I like this website very much, Its a really nice berth to read and receive information. “I look upon every day to be lost, in which I do not make a new acquaintance.” by Samuel Johnson.

  5. I have been surfing online greater than 3 hours as of late, yet I by no means discovered any fascinating article like yours. It’s pretty value enough for me. Personally, if all webmasters and bloggers made just right content as you probably did, the web shall be much more helpful than ever before.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం