సినిమా రాముడయ్యాడు
అడవిరాముడు!
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
హరి..హరి..
ఒక్క పాట..
అందులో ఎన్టీవోడి ఆట..
జయప్రద గోల..
ఎంత సంచలనం..
ఆ పాటతోనే
ఆ సినిమా హిట్టు
నందమూరి అయ్యాడు
తెలుగు సినిమా
పరిశ్రమలో మరోసారి
తిరుగులేని సామ్రాట్టు..!
ఎన్టీఆర్ రాముడు
సినిమాల పరంపరలో
అతి పెద్ద సక్సెస్
బద్దలైపోయింది బాక్సాఫీస్
అప్పటికి కొన్ని వైఫల్యాలతో
ఇబ్బంది పడుతున్న
తారకరాముడు..
ఇక ఎన్టీఆర్
పనైపోయిందేమోనన్న
విమర్శలను పటాపంచలు చేస్తూ అడవిరాముడు సూపర్
ఆపై వెనుదిరిగి చూడని
రామారావు
హిట్టు మీద హిట్టుతో
అందుకున్నాడు పవర్!!
ఔట్ డోర్
షూటింగులకు
దూరంగా ఉండే
ఎన్టీఆర్ అడవుల్లో తిరిగి
నిజంగా అయ్యాడు
అడవిరాముడు..
జలపాతాల్లో గెంతి..
ఏనుగులెక్కి..
రాళ్ళగుట్టలపై దూకి
అరవైలో ఇరవై అయ్యాడు
సినిమాని పరుగులు తీయించాడు..
అమ్మతోడు అబ్బతోడు అంటూ
ఇద్దరు నాయికలతో నృత్యాలు..
కోకిలమ్మ పెళ్లికి అంటూ
కోనంతా చేసిన సందడి..
కృషి ఉంటే మనుషులు
రుషులవుతారు..
ఈ పాటలో ధరించిన
బహురూపాలు…
నందమూరిని
జనం ఎలా ఎన్ని రకాలుగా చూడాలని కోరుకుంటారో
అన్ని గెటప్పులను సెటప్పు
చేసిన దర్శకరుషి
అభిమానుల్ని చేశాడు
భలే ఖుషి..
ఈ బొమ్మే చేసింది జయప్రద
అనే అందమైన బొమ్మని
తెలుగు సినిమా పట్టమహిషి..!
వేటూరి పాటలు..
జంధ్యాల మాటలు..
మామ సంగీతం..
జగ్గయ్య గంభీరమైన గొంతు
పులి ఉప్మా తిందేమిటి చెప్మా
రాజబాబు తంతు..
చరిత్ర అడక్కు చెప్పింది విను
నాగభూషణం పాలిష్డ్ విలనిజం..
సత్యనారాయణ మేనరిజం..
వెరసి అడవిరాముడు
నందమూరి తారక రామారావు
కమర్షియల్ సినిమాల్లో
అతి పెద్ద హిట్టన్నది
తిరుగులేని నిజం!!
సత్యచిత్ర వారి అడవిరాముడు
బ్లాక్ బస్టర్ మూవీ
విడుదలై నేటికి
48 సంవత్సరాలు
(28.04.77)
పూర్తయిన సందర్భంగా..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286


Hey! I just wanted to ask if you ever have any trouble with hackers? My last blog (wordpress) was hacked and I ended up losing many months of hard work due to no back up. Do you have any methods to prevent hackers?