Headlines

మెగా కోడలిగా వారేవాగుడ్ బై లెజినోవా..

అన్నా లెజినోవా..
పవన్ కల్యాణ్
అభిమానులనే కాదు..
తెలుగు ప్రజల గుండెల్లో
చెరిగిపోని ఒక ముద్ర..

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఇక్కడే కలిసాము అన్నట్టు
చిత్రంగా పవన్
జీవితంలోకి వచ్చింది..
చెట్టు మీద కాయ..
సముద్రంలో ఉప్పు…
ఉన్నంతకాలం ఆమె నిప్పు!

పవర్ స్టార్ డిప్యూటీ సీఎం
స్థాయికి ఎదిగే క్రమంలో
ఆయన వెంట నడిచింది..
పరాజయాలలో
ధైర్యం అయింది..
విజయాలలో
సంతోషంగా నిలిచింది..

పుట్టింది ఏ దేశమైనా
మెగా ఇంటికి కోడలయ్యాక
హిందువై ఆకట్టుకుంది..
తెలుగింటి కోడలిగా
అందరికీ నచ్చింది..

తెలియని మనుషుల్ని
తన మనసుతో..

మెగా కుటుంబాన్ని
తన నడవడితో..

పతి అభిమానుల్ని
తన కుటుంబంగా
సొంతం చేసుకుంది..
సాంతం ప్రశాంతంగా
నడుచుకుంది..

చీర కట్టింది..బొట్టు పెట్టింది
పూలు ముడిచింది..
పూజ చేసింది..
గుడికి వెళ్ళింది..
గుండు కూడా చేయించుకుంది..
పిల్లల్ని కలిపింది..
అందరినీ కలిసింది..
అందరితో కలిసిపోయింది..
ఇంతకంటే ఏముంది
సంప్రదాయం..
ఇంతకుమించి ఏముంటుంది
స్త్రీ ధర్మం..!

హుందాగా వచ్చింది..
అందంగా కనిపించింది..
అండగా నడిచింది..
గౌరవంగా వెళ్ళింది..
దేశం కాని దేశంలో
అందరికీ నచ్చింది..
తానూ ఈ దేశాన్ని మెచ్చింది..!

✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽

సురేష్..9948546286

Share this post
IN ARTICLE

Trending Global

భారత్ ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం