ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఐజేయూ నుంచి ముగ్గురికి సభ్యత్వాలు

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఐజేయూ నుంచి ముగ్గురికి సభ్యత్వాలు

జాతీయ స్థాయిలో ఐజేయూకు దక్కిన గౌరవం: అల్లం నారాయణ, ఆస్కాని మారుతి సాగర్

హైదరాబాద్: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) సభ్యులుగా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ఐజేయూ అధ్యక్షుడు గీతార్థ్ పాఠక్ (అస్సాం), ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ కోహ్లీ (చండీగఢ్), అదే యూనియన్‌కు చెందిన సభ్యుడు బిజాయ్ కే (మణిపూర్)లను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా నామినేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

తెలంగాణలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ–H-143) వంటి బలమైన సంఘంతో పాటు 21 రాష్ట్రాల జర్నలిస్టు యూనియన్లతో కలిసి జాతీయ స్థాయిలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం ఐజేయూ నిరంతరం కృషి చేస్తోందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి, ఐ జె యు కోశాధికారి ఆస్కాని మారుతి సాగర్ పేర్కొన్నారు. ఐజేయూ నుంచి ముగ్గురికి ప్రెస్ కౌన్సిల్ సభ్యత్వాలు లభించడం యూనియన్‌కు దక్కిన గౌరవంగా వారు అభివర్ణించారు.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా నామినేట్ అయిన వారు జర్నలిస్టుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, మీడియా స్వేచ్ఛను కాపాడే దిశగా చొరవ చూపాలని వారు ఆకాంక్షించారు. కొత్తగా సభ్యులుగా నామినేట్ అయిన అందరి సభ్యులతో పాటు ప్రత్యేకంగా ముగ్గురికి తెలంగాణ జర్నలిస్టుల తరఫున శుభాకాంక్షలు తెలిపారు

Share this post
IN ARTICLE

Trending Global

భారత్ ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం