మే 31న తెలంగాణ ఉద్యమ కమిటీ సంఘీభావ ర్యాలీని జయప్రదం చేయండి

తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ కమిటి రాష్ట్ర కన్వీనర్ గోధుమల కుమారస్వామి ఎన్నిక

ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్వర్యంలో జరిగిన సన్నాహాక సమావేశం

ఉద్యమ సంఘాల ఐక్యకార్యాచరణ నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం గురువారం హనుమకొండ జిల్లా కేంద్రం ములుగు రోడ్డులోని ముస్లిం మైనార్టీ సెంటర్ లో తెలంగాణ ఉద్యమ ఐక్య కార్యాచరణ కమిటి ఏర్పాటు చేసిన ఉద్యమకారుల సమావేశాన్ని సునీల్ ప్రారంభించగా, సమావేశానికి ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అధ్యక్షత వహించారు. కమిటి రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నికైన గోధుమల కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వరంగల్ జిల్లా ముఖ్యపాత్ర పోషించిందని అందులో అన్ని సంఘాలు కలిసి ఒకే వేదిక మీదకు రావడం సంతోషకరమైన విషయమని, ఉద్యమంలో విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు, నిరుద్యోగులు, ఆర్టీసీ, రైల్వే ఉద్యోగులు, కుల సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, సబ్బండ వర్గాల పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ప్రకటించిన పలాలు ఉద్యమకారులకు చెందవలసిన అవసరం ఉందని, ఉద్యమకారులను గుర్తించడానికి వేసిన కమిటీలో నిజాయితీ గలిగిన సామాజిక సంఘాలను కూడా రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేసారు. సాయిని నరేందర్ మాట్లాడుతూ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఉద్యమ సంఘాలు పనిచేయాలని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామ్మూర్తి మాట్లాడుతూ ఉద్యమకారులను గుర్తించడానికి వేసిన కమిటీ ఆరు నెలలలో ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేసారు. ఈ కమిటీ వరుసలో అమరవీరుల కుటుంబాలు రెండవ వరుసలో జైలుకుపోయిన వారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారు అలాగే కళాకారులు 1996 నుండి 25 వరకు తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నారని నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని రకరకాల కేసులు పెట్టిన వారిని ఉద్యమకారులుగా గుర్తించాలని, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వారిని రాష్ట్ర కమిటీలో, జిల్లా కమిటీలలో తీసుకోవాలని అప్పుడే నిజమైన ఉద్యమకారులందరికి న్యాయం జరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ప్రభుత్వానికి సూచన చేసారు. తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన సంఘాలకు అవకాశం కల్పించాలని రామ్మూర్తి ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర నాయకులు సోమ రామ్మూర్తి, ఆల్ ఇండియా ఓబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలకర శ్రీనివాస్, న్యూ డెమోక్రసీ నాయకులు నున్న అప్పారావు, తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ మంద వీరస్వామి తదితరులు మాట్లాడిన అనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ కమిటీని ఎన్నుకున్నారు ఈ కమిటీలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా తెలంగాణ ఆకాంక్షల వేదిక రాష్ట్ర కన్వీనర్ గోధుమల కుమారస్వామిని ఎన్నికున్నారు. కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా సందెల సునీల్, కాశ బోయిన యాకన్న, గుర్రం రఘు, అంబరీష్ భాషబోయిన, జోగుల సమ్మన్న, కరుణాకర్, ఆకుల పెళ్లి మహంకాళి, కార్తీక్, సాదం రాజన్న అంకుషావలి, నవరత్న ఆనంద్, కేడల ప్రసాద్, కృష్ణమూర్తి, చీకటి రాజు మొదలగువారు ఎన్నికయ్యారు. రాష్ట్ర గౌరవ సలహాదారులుగా సోమ రామమూర్తి, సాయిని నరేందర్, జిలకర శ్రీనివాస్, నున్న అప్పారావులను ఎన్నికున్నారు.
ఈ సమావేశంలో మహమ్మద్ హాజీ, ఎస్కే గౌస్ బాబు, ఐతమ్ నగేష్, రుద్రోజు నవీన్, చెరుకు ప్రవీణ్, శ్రీనివాస్, దార సూరి, రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం