విజయవాడలో పబ్లిక్ టాయిలెట్‌లో పసిపాప వదిలేసిన మహిళ
శానిటరీ సిబ్బంది గమనించి రక్షణ; పోలీసులు దర్యాప్తు ప్రారంభం

విజయవాడ నగరంలో పబ్లిక్ టాయిలెట్‌లో పసిపాపను వదిలివేసిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.
ఈ సంఘటన నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో జరిగింది.

పోలీసుల సమాచారం ప్రకారం, ఒక మహిళ పసిపాపతో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లి, లోపల బిడ్డను కింద పడుకోబెట్టి, ఎవరికీ కనిపించకుండా బకెట్‌ను అడ్డంగా పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కొంతసేపటి తర్వాత టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి వచ్చిన శానిటరీ సిబ్బంది పాప ఏడుపు విని గమనించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు పాపను చికిత్స కోసం పాత ప్రభుత్వ ఆసుపత్రి (Old GGH)కు తరలించారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మహిళను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this post
Tagged:

4 thoughts on “

  1. Excellet beat ! I wouyld likoe tto apprenbtice att thhe same
    time ass you ajend your site, howw could i subscribee for a weblog site?
    The accont helped me a acceeptable deal. I hhad bden a little biit familiar oof this yoyr broadcast proided vivid cloear idea

    Heere iss mmy website … roloxxx.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం