రక్షణ చట్టాన్ని తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన న్యాయవాదులు
వరంగల్, హనుమకొండలో న్యాయవాదుల ర్యాలీ, సభ
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy న్యాయవాదుల రక్షణ, సంక్షేమ బిల్లును రాష్ట్ర శాసనసభలో ఆమోదించినందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు ప్రాంగణం నుండి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం హనుమకొండ జిల్లా కోర్టు హాలులో సభ జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముద్దసాని సహోదర్ రెడ్డి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుధీర్ మాట్లాడుతూ, న్యాయవాదులు ఎన్నో సంవత్సరాలుగా సాగించిన పోరాటానికి ఈ చట్టం ఒక ముఖ్యమైన ఫలితమని తెలిపారు. న్యాయవాదుల గౌరవం, భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
బిల్లుకు మద్దతు తెలిపిన మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చట్టం కోసం నిరంతరం పోరాడిన న్యాయవాదులందరికీ అభినందనలు తెలిపారు. ఇది తెలంగాణ న్యాయవాదుల సమిష్టి పోరాట ఫలితమని అన్నారు.
బిల్లులోని ముఖ్య అంశాలను వివరిస్తూ, న్యాయవాదిపై దాడి చేసిన వారికి 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.25 వేల నుండి రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారని తెలిపారు. బాధిత న్యాయవాదులకు వ్యక్తిగత, ఆస్తి నష్టాలకు పరిహారం అందించే నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ప్రమాద పరిస్థితుల్లో మేజిస్ట్రేట్ అనుమతితో పోలీసు రక్షణ పొందే హక్కు ఉంటుందని వివరించారు.
అదేవిధంగా, కార్పస్ ఫండ్ ద్వారా ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, జూనియర్ న్యాయవాదులకు స్టైపెండ్ వంటి సంక్షేమ పథకాలు కూడా బిల్లులో పొందుపరిచినట్లు తెలిపారు.
న్యాయవాదులు సురక్షితంగా ఉన్నప్పుడే న్యాయం సజీవంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇరు బార్ అసోసియేషన్ల పదాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.



I love wha you gguys tdnd too bee uup too. Thiss sort oof clever work aand coverage!
Keeep upp thhe excellednt wirks gugs I’ve yyou gjys tto
blogroll.
References:
Tabactivity https://arranggfz532582.blogdiloz.com