Headlines

ప్రత్యూష హత్య కేసు: సుప్రీం కోర్టు సంచలన తీర్పు

– హత్య కాదు, విషప్రయోగం ద్వారా ఆత్మహత్య; సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు ధృవీకరణ, 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు **

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17, 2026: తెలుగు నటి ప్రత్యూష (ప్రత్యూష్య) మృతి కేసులో 24 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి అప్పీల్‌ను కొట్టివేసి, హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను ధృవీకరించింది. నాలుగు వారాల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యూష తల్లి సరోజిని దేవి దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా తిరస్కరించింది.

**సుప్రీం కోర్టు తీర్పు కీలక అంశాలు:**
జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పు ప్రకారం – హత్య జరగలేదు, గొంతు నులిమి (strangulation) కాదు, రేప్ ఆరోపణలు నిరూపితం కాలేదు. అధిక సాక్ష్యాలు, వైద్య నివేదికలు ప్రత్యూష మరణం విషప్రయోగం (పురుగుల మందు – న్యూరోన్ టోన్) వల్లే అని స్పష్టం చేసింది. ఇది ఇద్దరి మధ్య ఆత్మహత్య పథకం (suicide pact), బతికి బయటపడిన భాగస్వామి సిద్దార్థ రెడ్డి ఆత్మహత్యకు ప్రేరేపిoచాడని అతన్ని దోషి అని నిర్ధారించింది.
డా. బి. ముని స్వామి పోస్ట్‌మార్టం రిపోర్టును ‘అప్రొఫెషనల్’ అని విమర్శించింది.

**నిందితుడు సిద్ధార్థ రెడ్డి వెర్షన్:**
సిద్ధార్థ రెడ్డి (ప్రత్యూష ప్రియుడు) తన వైపు నుంచి ఇలా వాదించాడు – ఇంటర్ కాలేజీ నుంచి 6 ఏళ్లుగా ప్రేమించుకున్నాం. నా కుటుంబం (ముఖ్యంగా తల్లి) వ్యతిరేకించడంతో ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. 2002 ఫిబ్రవరి 23న కారులో వెళ్లి పురుగుల మందు కొని, కోక్‌లో కలిపి ఇద్దరం తాగాం. నేను బతికిపోయాను, ప్రత్యూష చనిపోయింది. ఇది ఉద్దేశపూర్వక హత్య కాదు, ప్రమాదం కాదు – ఆత్మహత్య పథకం. సెషన్స్ కోర్టు 2004లో 5 ఏళ్ల జైలు, హైకోర్టు 2011లో 2 ఏళ్లకు తగ్గించింది. ఈ శిక్ష రద్దు చేయాలని సుప్రీంలో అప్పీల్ చేశాడు, కానీ తిరస్కరించబడింది.

**ప్రత్యూష తల్లి సరోజిని దేవి వెర్షన్:**
ప్రత్యూష తల్లి సరోజిని దేవి మొదటి నుంచి ఇది ఆత్మహత్య కాదని, సిద్ధార్థ రెడ్డి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడని వాదిస్తున్నారు. “నా కూతురు చంపబడింది. సాక్ష్యాలు తారుమారు చేశారు. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే జీవిత ఖైదు పడేది” అని సుప్రీం తీర్పు తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. “ముని స్వామి రిపోర్టును కోర్టులు కన్ఫర్మ్ చేయలేదు. ఆ రిపోర్టు తీసుకుంటే బాగుండేది. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి రిపోర్టు తెప్పించారు. ప్రత్యూష డెడ్ బాడీని చూడలేదు, ఎలా చనిపోయిందో వాళ్లకు తెలియదు” అని ఆరోపించారు. సిద్ధార్థ తన కెరీర్‌కు ఆటంకం కలుగుతుందని భయపడి హత్య చేశాడని, రాజకీయ ప్రముఖుల కుటుంబాలు కూడా ఇందులో ఉన్నాయని ఆమె ఆరోపణలు. తీర్పుపై “నాకు న్యాయం జరగలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్ష పెంచాలని 2012లో సుప్రీంలో అప్పీల్ చేశారు, అది కూడా తిరస్కరించబడింది.

ఈ కేసు 2002లో హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది. సీబీఐ దర్యాప్తు తర్వాత సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద కేసు నమోదు అయింది. సుప్రీం తీర్పుతో 23 ఏళ్ల న్యాయపోరాటం ముగిసినట్లు అయ్యింది. సిద్ధార్థ రెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. నాలుగు వారాల్లో లొంగిపోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం
కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల