ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన లయన్స్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యుడిగా ఉండటం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏరియా లీడర్ లయన్ దీపక్ భట్టాచార్జి పేర్కొన్నారు.
మంగళవారం రాత్రి జనగామ పట్టణంలో రీజియన్ చైర్పర్సన్ లయన్ రామిని శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన వేడుకలో దీపక్ భట్టాచార్జి మాట్లాడుతూనిర్వహించిన లయన్స్ క్లబ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.









ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేదలు, అనాథలు, వికలాంగులు, అవసరార్థులకు చేయూతనివ్వడమే లయన్స్ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ సంస్థ విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఆకలి నిర్మూలన, కంటి వైద్య సేవలు వంటి అనేక రంగాల్లో సేవలు అందిస్తూ కోట్లాది మందికి ఆశగా నిలుస్తోందని చెప్పారు.
లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పేదలకు అవసరమైన వస్తువుల పంపిణీ వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సేవా కార్యక్రమాల అమలులో లయన్స్ సభ్యుల అంకితభావం, సేవాభావం ప్రశంసనీయమని ఆయన అన్నారు.
సేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న లయన్స్ సభ్యులు వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి సమాజ హితానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత ఎక్కువ సంఖ్యలో లయన్స్ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, తద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావచ్చని సూచించారు.
ప్రకృతి విపత్తులు జరిగిన తక్షణమే స్పందించి సహకారం అందించే లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ బలోపేతం చేయుటకు లయన్ నాయకులు సహకరించాలని కోరారు. స్పందించి వెయ్యి డాలర్లు విరాళం ఇచ్చి ప్రోగ్రెసివ్ మెల్విన్ జోన్స్ సభ్యులు గా చేరుటకు ముందుకు వచ్చిన రీజియన్ చైర్మన్ లు రామిని శ్రీనివాసులు, చంద్రగిరి శ్రీనివాస్ ను అభినందిస్తూ ఇరువురికి సంబంధిత లయన్ పిన్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఈ రేజియన్ లో విశేషంగా కృషి చేస్తున్న పది మంది లయన్ నాయకులను గుర్తించి అంతర్జాతీయ అధ్యక్షుని ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. రీజియన్ ప్రథమ లయన్ లేడీ లయన్ సరస్వతి జ్యోతి ప్రజ్వలన చేయగా జిల్లా గవర్నర్ లయన్ డా చంద్రశేఖర్ ఆర్య ప్రారంభోపన్యాసం చేసి వేడుకను ప్రారంభించారు. రీజియన్ మీట్ కో చైర్మన్ లయన్ అల్లాడి ప్రభాకర్ స్వాగతం పలికారు. కీలకోపన్యాసం చేసిన రీజియన్ చైర్మన్ లయన్ రామిని శ్రీనివాసులు సిద్దేశ్వర రీజియన్ లో చక్కగా పని చేసిన క్లబ్ లు నాయకులను గుర్తించి వారిని అభినందిస్తూ ప్రసంగించారు. ఉత్తములుగా ఎంపికైన నాయకులకు అవార్డులు ప్రదానం చేశారు. రీజియన్ మీట్ సందర్భంగా నిర్వహించిన బ్యానర్ ప్రెజెంటేషన్ లో ఉత్తమ క్లబ్ గా మిలీనియం, ద్వితీయ ఉత్తమ క్లబ్ అవార్డు బి బాయ్స్ క్లబ్ కు లభించింది. బెస్ట్ క్లబ్ అవార్డు జనగామ డైమండ్స్ కు లభించగా ఉత్తమ అధ్యక్షులుగా లయన్ భోగ రాం దయాకర్ ( సూర్య), లయన్ శివరామకృష్ణ (డైమండ్స్), బండ భిక్షపతి ( మిలీనియం), కన్న శ్రీనివాస్ (బి బాయ్స్), కారంపూడి సత్యనారాయణ (ఆబాద్) లు ఎంపికయ్యారు. ఫస్ట్ వైస్ జిల్లా గవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి, సెకండ్ వైస్ జిల్లా గవర్నర్ లయన్ పుట్ట హరికిషన్ రెడ్డి, పూర్వ జిల్లా గవర్నర్ లయన్ ముచ్చ రాజిరెడ్డి, సెకండ్ వైస్ జిల్లా గవర్నర్ అభ్యర్థులు లయన్ రేవూరి రమణారెడ్డి, లయన్ డా. అజిత్ కుమార్ లు ప్రసంగించారు. పూర్వ జిల్లా గవర్నరులు కన్న పరశురాములు రీజియన్ చైర్మన్ రామిని శ్రీనివాసులు ను, డా. డి. లవకుమార్ రెడ్డి ముఖ్య అతిథి దీపక్ భట్టాఛార్జీ నీ సభకు పరిచయం చేశారు. జోన్ చైర్మన్ లు ఫజ్జూరి లక్ష్మీ నర్సయ్య, బైరీ వెంకటేశ్వర్లు, నివేదికలు సమర్పించారు. ఈ రీజియన్ కు చెందిన పూర్వ చైర్మన్లు ను సన్మానించారు. రీజియన్ చైర్మన్ సహచరులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ వేడుకలో జిల్లా క్యాబినెట్ కార్యదర్శి రేణుకుంట్ల ప్రకాశం, జిల్లా చీఫ్ సెక్రటరీ సర్వీసెస్ మార్గం ప్రభాకర్, జిల్లా చీఫ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ చంద్రగిరి ప్రసాద్, రీజియన్ మీట్ చైర్మన్ సి. ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి శ్రీభాష్యం రఘు, చీఫ్ కోఆర్డినేటర్ పబ్బ చంద్రశేఖర్, రీజియన్ కార్యదర్శి నాగబండి రవీందర్, గాట్ లీడర్స్ వేలూరి శారద, టి. వెంకట్ రెడ్డి, కుర్రెముల యాదగిరి, క్రిష్ణ జీవన్ బజాజ్, ఎం. ఉషా మార్తా, కె. సుభాష్, జి. ప్రమోద్ గుప్త, రీజియన్ చైర్మన్లు ఎం. పద్మజదేవి, దుస్స శివశంకర్, ఊరుగొండ రాజేందర్, పొన్నాల సంయుక్త, దామెర సరేష్, చంద్రగిరి శ్రీనివాస్, హోస్ట్ క్లబ్ జనగామ ఆబాద్ కార్యదర్శి పులగం సురేశ్, కోశాధికారి సుదగాని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు లయన్స్ క్లబ్ నాయకులు, సభ్యులు, ఆహ్వానితులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.


Its like you read my mind! You appear to know a lot about this, like you wrote the book in it or something. I think that you can do with a few pics to drive the message home a little bit, but instead of that, this is excellent blog. A fantastic read. I will definitely be back.