“తెలంగాణ యువకులు డ్రగ్స్ మహమ్మారికి బలవకూడదు” – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


హైదరాబాద్‌: శిల్పకళావేదికలో “అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల దుర్వినియోగం, అక్ర‌మ ర‌వాణా వ్యతిరేక దినం” సందర్భంగా TGNAB ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు విశ్వేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, TFDC చైర్మన్ దిల్ రాజు, హోం శాఖ స్పెషల్ సీఎస్ రవి గుప్త, డీజీపీ జితేందర్, TGNAB డైరెక్టర్ సందీప్ శాండిల్య, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ భవిష్యత్తును కాపాడేందుకు మాదకద్రవ్యాలపై సమగ్ర పోరాటం అవసరమని అన్నారు. “తెలంగాణ యువత ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలి, డ్రగ్స్ మహమ్మారికి బలికాకూడదు,” అని సీఎం పిలుపునిచ్చారు.



• ఐతిహాసిక ఉద్యమ గడ్డ తెలంగాణ: నిజాం పాలన, రాజాకార్లకు విరుద్ధంగా పోరాడిన వీరుల తరం పుట్టిన ప్రదేశం తెలంగాణ అని సీఎం గుర్తు చేశారు. ఆ స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిందని అన్నారు.
• డ్రగ్స్ మీదనే ప్రభుత్వం నిఘా: “మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మాదకద్రవ్యాలపై గట్టి హెచ్చరిక చేసాం…. డ్రగ్స్ ఆలోచించినా వెన్ను విరుస్తామని చెప్పాం,” అని అన్నారు.
• యువత – దేశ శక్తి, ప్రపంచానికి ఆదర్శం: దేశ జనాభాలో 68 శాతం యువత ఉన్నట్టు గుర్తుచేస్తూ, మన దేశాన్ని లక్ష్యంగా పెట్టుకొని శత్రుదేశాలు వివిధ మార్గాల్లో బలహీనపరిచే ప్రయత్నాల్లో ఉన్నాయని తెలిపారు. పంజాబ్ యువత గంజాయి బానిసలుగా మారిన పరిస్థితిని ఉదాహరణగా చూపించారు.
• డ్రగ్స్ నియంత్రణకు  EAGLE:
• “TGNAB” వ్యవస్థకు బదులుగా EAGLE (Elite Action Group for Drug Law Enforcement) అనే ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
• ఈ బలగం రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ సాగు, రవాణాను గుర్తించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
• విద్యా సంస్థలపై బాధ్యత: పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించే బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రవర్తనను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు.


• యువతకు సానుకూల అవకాశాలు:
• రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ ప్రవేశపెట్టామని
• స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని
• క్రీడాకారులకు ఉద్యోగాల్లోనే కాదు, రాబోయే రోజుల్లో రాజకీయాల్లోనూ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
• తాను నల్లమల నుండి వచ్చి జెడ్పీటీసీ స్థాయిలో సీఎం స్థాయికి ఎదిగినట్టు తెలిపారు.
• నటుడు విజయ్ దేవరకొండను ఉదాహరణగా పేర్కొన్నారు. “కష్టం, కమిట్‌మెంట్ ఉంటేనే ఎదుగుదల సాధ్యమవుతుంది,” అన్నారు.
సీఎం పిలుపు:
“తెలంగాణ గడ్డను డ్రగ్స్ కు వేదిక కాకుండా మనమందరం కలసి కాపాడుకుందాం. నో డ్రగ్స్ ఉద్యమానికి యువతే వారధి కావాలి. ప్రపంచానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుకుందాం.”

Share this post

3 thoughts on ““తెలంగాణ యువకులు డ్రగ్స్ మహమ్మారికి బలవకూడదు” – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  1. You really make it seem so easy with your presentation but I find this topic to be really something that I think I would never understand. It seems too complex and extremely broad for me. I’m looking forward for your next post, I will try to get the hang of it!

  2. It is truly a nice and helpful piece of info. I’m satisfied that you just shared this useful information with us. Please keep us informed like this. Thank you for sharing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం