OPERATION SINDHOOR దిగ్విజయం అవ్వాలని, భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
వేములవాడ, మే 9, 2025 – భారత సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత వైమానిక దళం, నావికాదళం మరియు సైన్యానికి దైవిక బల రక్షణ మరియు ఆశీస్సులు ఉండాలని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం, అలాగే దేశవ్యాప్తంగా శాంతి మరియు సామరస్యం నెలకొనాలని ఆలయము నందు చండీ సహిత రుద్ర హోమం నిర్వహించారు.
భారతావని పై ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షం ఉండాలని, భారత సాయుధ దళాలకు సంపూర్ణ దిగ్విజయం చేకూరాలని దక్షిణ కాశీ గా పేరు గాంచిన వేములవాడ ఆలయ అర్చకులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పురః ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.


you might have a fantastic weblog here! would you wish to make some invite posts on my weblog?
Your place is valueble for me. Thanks!…
This is the right blog for anyone who wants to find out about this topic. You realize so much its almost hard to argue with you (not that I actually would want…HaHa). You definitely put a new spin on a topic thats been written about for years. Great stuff, just great!