రక్తదానం చేయండి – ప్రాణాలు కాపాడండి-జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ పిలుపు


వరంగల్ బార్ అసోసియేషన్‌లో రక్తదాన శిబిరం

వరంగల్:
తలసీమియా, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రమాదాల్లో గాయపడినవారికి రక్తదానం ప్రాణదాయకమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ అన్నారు. రక్తదానం చేయడం మనిషితనానికి ప్రతీకగా, సమాజ సేవలో గొప్ప భాగమని ఆమె సూచించారు.
మంగళవారం వరంగల్ కోర్టు ప్రాంగణంలోని డీఎల్ఎస్ సేవా సదన్‌లో, వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.
వరంగల్, హనుమకొండ జిల్లా న్యాయమూర్తులు నిర్మలా గీతాంబ, పట్టాభి రామారావులు మాట్లాడుతూ రక్తదానం వల్ల ఎందరో ప్రాణాలు కాపాడబడతాయని, న్యాయవాదులు సామాజిక బాధ్యతను గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్ మాట్లాడుతూ—
ప్రస్తుతం రాష్ట్రంలో రక్తానికి భారీ డిమాండ్ ఉందని,
♦ తలసీమియా పిల్లలు
♦ అత్యవసర శస్త్రచికిత్సలు
♦ క్యాన్సర్ రోగులు
♦ ప్రమాద బాధితులు
ప్రాణాలు అట్టడుగు మీద పెట్టుకుని రక్తం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.
మన శరీరం నుంచి ఇచ్చే ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలకు వెలుగునిస్తుందని, రక్తదానం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్‌ఏ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సాయి కుమార్, న్యాయమూర్తులు క్షమా దేశ్‌పాండే, రామలింగం, నారాయణ బాబు, ఉషా క్రాంతి, పూజ, నందికొండ రితిక, హారిక, వెంకట చంద్ర ప్రసన్న, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు హనుమకొండ బార్ అధికారులతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
మొత్తం 60 మంది న్యాయవాదులు రక్తదానం చేశారు. ప్రతి దాతకు పండ్లు మరియు సర్టిఫికేట్‌లు అందజేసి నిర్వాహకులు అభినందించారు. రక్తంతో ప్రాణాలను కాపాడే ఈ మహత్తర సేవలో పాల్గొన్న వారందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు.

Share this post

One thought on “రక్తదానం చేయండి – ప్రాణాలు కాపాడండి-జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ పిలుపు

  1. Thank you for any other informative web site. Where else may I get that kind of info written in such an ideal manner? I have a challenge that I am just now running on, and I have been on the look out for such info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన