రాజ్యాంగ రక్షణతోనే ప్రజాస్వామ్య రక్షణ
వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్
ప్రజాస్వామ్యానికి బలమైన పునాది రాజ్యాంగమని, రాజ్యాంగాన్ని సవ్యంగా అమలు చేసిన నాడే ప్రజాస్వామ్యం రక్షించబడుతుందని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్ అన్నారు. 76 వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం వరంగల్ బార్ అసోసియేషన్ అంబేద్కర్ హాల్ లో ఘనంగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు గౌరవిస్తూ ఆశయాల వెలుగులో నడవాలని అన్నారు. మన రాజ్యాంగం మూడు శాశ్వత పునాదులపై నిలబడి ఉందని
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, హక్కులతో పాటు బాధ్యతలు కూడా అప్పగిస్తాయంటూ
న్యాయవాదులుగా మన పాత్ర మరింత ముఖ్యమైనదని, హక్కులను రక్షించడం, న్యాయాన్ని కాపాడడం, సమాజాన్ని చైతన్యపరచడం కూడా న్యాయవాదుల ధర్మమని అన్నారు.

రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు బైరపాక జయాకర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి డి. రమాకాంత్, సంయుక్త కార్యదర్శి రేవూరి శశిరేఖ, కోశాధికారి సిరుమళ్ల అరుణ, సీనియర్ ఇ సి మెంబర్ ఇజ్జేగిరి సురేష్, మహిళా సీనియర్ ఇ సి మెంబర్ కలకోట నిర్మల జ్యోతి, ఈసి సభ్యుడు మర్రి రాజు, సీనియర్ న్యాయవాదులు తీగల జీవన్ గౌడ్, వి వెంకట రత్నం, సాయిని నరేందర్, జన్ను పద్మ, మధుకర్ లు రాజ్యాంగం ఆవశ్యకత, నయావాదుల పాత్రపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కవిత, అంజలి, సౌందర్య, కల్యాణి, విలాసాగరం సురేందర్, సాంబశివరాజు, ఎగ్గడి సుందర్ రామ్, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, గురిమల్ల రాజు, పి శ్రీనివాస్, అనిత, లోకేష్, తాళ్ళపళ్లి మదూకర్ తదితరులు పాల్గొన్నారు.

