విజయవాడ, ఫిబ్రవరి 23, 2026: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. . కాపు సమాజానికి ఐకాన్‌గా గుర్తింపు పొందిన దివంగత నాయకుడు వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ రంగప్రవేశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆంద్రరాజకీయాలంటే ఆశామాషి వ్యవహారంకాదు.రాజకీయ ప్రత్యర్థులను ఎదగనీయకుండా ఏకంగా మట్టుబెట్టి చిట్టా దొరకకుండా చేస్తారు.
పేదల గుండెల్లో గూడుకట్టుకున్న నేత వంగ వీటిరంగాను ఇలాగే లేపేసారు. రంగాహత్య పూర్వాపరాలు ఎలా ఉన్నా ఇప్పటికి విజయవాడలో ఆయన పేరెత్తితో హడల్.
ఆయణ మరణానంతరం ఆయనసతీమని రాజకీయాల్లోకివచ్చినా కమ్మ,కాపు పాలిటిక్స్ లో పట్టు సాధించి నిల దొక్కు కోలే కపోయారు.
రంగా కుమారుడు రాధా రంగప్రవేశం చిసినా ఆశించిన రీతిలో ఎదుగుదల లేదు.
రంగా కుమార్తె అచ్చుతండ్రి పోలికలతో కనిపించే ఆషాకిరణ్ గతకొన్ని సంవత్సరాలనుండి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఆంద్ర రాజకీయాల్లో చర్చగామారింది.
అదిగో ఇదిగో అంటూవార్తలు వచ్చినా ఆషా కిరణ్ తొందరపడకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తనసోదరుడు రాధాతోకల్సి సమాజసేవలో ఉన్నారు.
ఈ మధ్య ఆమె వై.ఎస్ఆర్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తపై ఆమె స్పష్టత ఇచ్చారు.
ఏపార్టీలో చేరడం లేదని తన తండ్రి లాగే పేదల శ్రేయస్సు కోసం సమాజ సేవ చేస్తానని ప్రకటించారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవలో భాగం కావాలని ఆమె స్పష్టం చేశారు.
గతంలో 2025 నవంబర్ 16న విజయవాడలోని రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి ఆశా కిరణ్ అధికారికంగా రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు సమాజ సేవ ద్వారా ప్రజల మధ్యకి రావాలని నిర్ణయించుకున్నారు.
వంగవీటి రంగా – ప్రజల మనసుల్లో చిరస్థానం
వంగవీటి మోహన రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా గుర్తింపు పొందారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన, ముఖ్యంగా కాపు సమాజ సమస్యలపై పోరాడి ప్రజల మన్ననలు పొందారు. 1988 డిసెంబర్ 26న ఆయన హత్య రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అప్పటి నుంచి ఆయన పేరు, ప్రభావం విజయవాడ రాజకీయాల్లో కీలకంగా కొనసాగుతోంది.
తండ్రి మరణం తర్వాత ఆశా కిరణ్ ఎక్కువ కాలం ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు ‘రంగా మిత్ర మండలి’ సభ్యులతో చర్చలు జరిపి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.
ఏ పార్టీలో చేరతారు? రాజకీయ వర్గాల్లో చర్చ
ఆశా కిరణ్ రాజకీయ ప్రవేశం ప్రకటించిన తర్వాత, ఆమె ఏ పార్టీలో చేరతారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆ ర్‌సీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. రంగా మిత్ర మండలి నాయకులు, అభిమానులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటానని ఆశా కిరణ్ వెల్లడించారు. కాపు సమాజంలో ఆమె కుటుంబానికి ఉన్న ప్రభావం, విజయవాడలో ఉన్న బలమైన మద్దతు నేపథ్యంలో ఆమె రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తి నెలకొంది.
అభిమానుల్లో ఉత్సాహం, రాజకీయాల్లో కొత్త సమీకరణలు?
ఆశా కిరణ్ పై కాపు సమాజంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమె పాత్ర కీలకంగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆమె ఏ పార్టీని ఎంచుకుంటారు? ఏ నియోజకవర్గం నుంచి రాజకీయంగా అడుగులు వేస్తారు? అనే అంశాలు ముందు రోజుల్లో స్పష్టతకు వచ్చే అవకాశముంది.

