పేరు తాపీ..
సాహిత్యమే బయోగ్రఫీ..!
ఇంటి పేరు తాపీ..
తెలుగు భాషకు ఆయనే కూపీ
ధర్మారావంటే సాఫీ..
సాహిత్య సమగ్రమే
ఆయన బయోగ్రఫీ..!
ఆంధ్రులకొక మనవి
అనడానికి మునుపే
బరంపురంలో
పొడిచింది వేగుచుక్క..
అక్కడే మొదలైంది
మాస్టారి జీవితాన
సరైన లెక్క!
పుట్టింది కల్లికోటలో
కొన్నాళ్ళు పాగా వేసింది
బొబ్బిలి రాజుల కోటలో..
బోధించింది లెక్కలే..
జీవితమంతా చిక్కులే..
రైతుబిడ్డ సినిమాకి
ఈ రైతుబిడ్డే రాశాడు మాటలు
గిడుగు వారి శిష్యరికం..
నేర్పింది తెలుగు భాషలో పెద్దరికం…మాలపిల్లకూ
చెప్పినా మంచి మాటలు
వెనకెయ్యలేదు మూటలు…!
తొలి ప్రయత్నంలో మెట్రిక్ కూడా పాసవ్వని ఈ బుడతడు
“కొత్తపాళీ”తో
మెట్రిక్ టన్నుల కొద్దీ
రాసేసి సాహిత్యం..
అందులో కొన్ని
“సాహితీ మొర్మరాలు”
దట్టించి..ఛాందసవాద
సాంప్రదాయాల
బూజు వదిలించి…
విజయవిలాసంపై
హృదయోల్లాస వ్యాఖ్యతో
సాహిత్య అకాడమీ అవార్డు
సొంతం..
“దేవాలయాలపై బూతుబొమ్మలు”..
“పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాల
పని పట్టేసి ఆసాంతం”!
పెద్దాయన తాపీ కాని
కొడుకు మాత్రం స్పీడే..
అందుకే
“రోజులు మారాయి”
అంటూ
ఎన్టీవోడి
తొలి డబుల్ రోల్
సినిమా
రాముడు భీముడు తీసేసి
కొట్టాడు హిట్టు..
నాన్న పేరు నిలబెట్టి!
తాపీ ధర్మారావు
జయంతి..
(19.09.1887)
సందర్భంగా ప్రణామాలు..
(ఈయన మా ఇంటికి
తరచూ వచ్చి వెళ్లేవారని..
కొన్నాళ్ళు మా ఇంట్లో ఉన్నారని కూడా
మా నాన్నగారు..
తాతగారు చెబుతూ ఉండేవారు)
*ఎలిశెట్టి సురేష్ కుమార్*
విజయనగరం
9948546286
7995666286