డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ


‘తెలంగాణ రైజింగ్’లో ట్రాన్స్ ఫార్మేషన్ టూల్ గా టెక్నాలజీ

*
కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ స్ సామాన్యుడికి చేరువ చేయాలన్నదే మా తపన

*
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు

ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను సామాన్యుడికి చేరువ చేసి… డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో టెక్నాలజీని కేవలం ఓ సాఫ్ట్ వేర్ గా మాత్రమే కాకుండా… ఓ ట్రాన్స్ ఫార్మేషన్ టూల్ గా మార్చుకుంటున్నామన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రణాళికలను న్యూఢిల్లీ భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో భాగంగా శుక్రవారం ‘ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్; ఏఐ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ క్లైమేట్ రెసిలియెన్స్’ అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. పౌర సేవలకు టెక్నాలజీని అనుసంధానం చేసి… ప్రభుత్వానికి, పౌరులకు మధ్య ఉండే దూరాన్ని తగ్గించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఐకం(AIKAM), ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ఛేంజ్, భూ భారతి లాంటి విప్లవాత్మక సంస్కరణలు డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణ బ్రాండ్ ను సుస్థిరం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక ఫలాలను కేవలం ఓ ప్రాంతానికో లేదా వర్గానికో పరిమితం చేయకుండా అందరికీ చేరువ చేసేలా ‘ఏజెంటిక్ ఏఐ’ వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. టెక్నాలజీని కేవలం గవర్నెన్స్ కు మాత్రమే పరిమితం చేయకుండా వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, సుస్థిర నగరాల అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ తదితర రంగాలకూ విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Share this post

One thought on “డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ

  1. Youre so cool! I dont suppose Ive read something like this before. So good to search out somebody with some unique ideas on this subject. realy thank you for beginning this up. this web site is one thing that’s wanted on the net, somebody with just a little originality. useful job for bringing something new to the internet!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం