Headlines

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ



హైదరాబాద్‌:
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగతిభవన్‌లో ‘తెలంగాణ రైజింగ్–2047’ పాలసీ డాక్యుమెంట్‌తో పాటు గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాన అంశాలను వివరించారు.
భవిష్యత్ తరాల కోసం పాలసీ డాక్యుమెంట్ – సీఎం రేవంత్ రెడ్డి
సీఎం మాట్లాడుతూ—
“తెలంగాణ గత అనుభవాలను విశ్లేషించి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచే విధంగా ‘తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్’ సిద్ధం చేస్తున్నాం. నీతి ఆయోగ్, ఐఎస్బీ వంటి సంస్థల నిపుణుల సహకారంతో ఈ పథకాన్ని రూపుదిద్దుతున్నాం. ఇది లక్షలాదిమంది ప్రజల భాగస్వామ్యంతో రూపొందుతున్న విప్లవాత్మక విజన్” అని పేర్కొన్నారు.
మూడు ఆర్థిక మండలాల రూపొందింపు
సీఎం వివరించిన ముఖ్యాంశాలు:
• హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి
• కాలుష్యరహిత నగర నిర్మాణం, మెట్రో విస్తరణ, మూసీ రీవాంప్
• అవుటర్ రింగ్ అవతల 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్
• మూడో వలయం—రైతాంగం, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం
• గ్రీన్‌ఫీల్డ్ హైవే, బుల్లెట్ ట్రైన్, మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ
• వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండం లో కొత్త ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనలు
• తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యం
2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
“దేశంలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడం మా లక్ష్యం. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధితో తెలంగాణను ప్రపంచ పోటీలో ముందుండే రాష్ట్రంగా మార్చుతాం” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
విభాగాల వారీగా నివేదికల సమర్పణకు సీఎం ఆదేశాలు
• డిసెంబర్ 2 రాత్రికి మంత్రులు, విభాగాధిపతులు తమ నివేదికలు సమర్పించాలి
• డిసెంబర్ 3, 4న సీఎస్‌, స్పెషల్ సీఎస్‌, సీఎంవో పరిశీలన
• డిసెంబర్ 6నాటికి ఫైనల్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం
ఉమ్మడి జిల్లాల్లో డిసెంబర్ 1–6వరకు ఉత్సవాలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించిన షెడ్యూల్:
• డిసెంబర్ 1 – మక్తల్ (మహబూబ్‌నగర్)
• డిసెంబర్ 2 – కొత్తగూడెం (ఖమ్మం)
• డిసెంబర్ 3 – హుస్నాబాద్ (వరంగల్)
• డిసెంబర్ 4 – ఆదిలాబాద్
• డిసెంబర్ 5 – నర్సంపేట (వరంగల్)
• డిసెంబర్ 6 – దేవరకొండ (నల్లగొండ)
ప్రతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రజలతో సంభాషణలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతాయి.
డిసెంబర్ 8–9: గ్లోబల్ సమ్మిట్ – ప్రపంచ ప్రముఖులకు ఆహ్వానాలు
ప్రభుత్వ నిర్ణయాలు:
• ప్రధానమంత్రికి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల‌ను సీఎం స్వయంగా కలసి ఆహ్వానించనున్నారు
• అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామిక‌వేత్త‌లు, ఆర్థిక నిపుణులు, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు
• ఆహ్వాన కమిటీ ఏర్పాటుచేసి వెబ్‌సైట్ ప్రారంభం
• ఇప్పటివరకు 4,500 మందికి ఆహ్వానాలు; 1,000 మంది హాజరు నిర్ధారించారు
డిసెంబర్ 13న హైదరాబాద్‌లో మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్
ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాన్ని ఆకర్షించే లక్ష్యంతో, ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ ని హైదరాబాద్‌కు ఆహ్వానించారు.
డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు