సామ్రాజ్యవాద అమెరికా యుద్ధోన్మాదంతో ఇరాన్ పై చేస్తున్న దౌర్జన్యకర యుద్ధాన్ని ఆపాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర ఛైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేసారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడిని ఖండిస్తూ హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన శాంతియుత నిరసనలో ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోడీ విదేశాంగ విధానంలో మార్పులు చేయాలని, దేశంలోని అదానీ, అంబానీ లాంటీ కొద్ది మంది మేలు కోసం అమెరికాకు మద్దతు పలికి యుద్ధాలకు పరోక్షంగా మద్దతు పలకడం సరికాదని, బిజెపి ప్రభుత్వ అలీన దేశాల విధానాల వల్ల దేశ ప్రజలకు కలుగుతున్న నష్టాలను దేశంలోనే 140 కోట్ల ప్రజలు గమనిస్తున్నారని, మోడీ విధానాలను మార్చుకోకుంటే రానున్న రోజుల్లో బిజెపికి ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విముక్త చిరుతల కచ్చి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు గత పదిహేను రోజులుగా అన్యాయంగా యుద్ధం చేస్తున్నాయని ఇరాన్ దేశ అధ్యక్షుడు ఖమేనీని హత్యచేసిన ఈ రెండు దేశాలు తమ దౌర్జన్యాన్ని నిసిగ్గుగా సమర్ధించుకుంటున్నాయని, ఈ యుద్ధం వల్ల మన దేశంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని అన్నారు. యుద్ధం ఆగిపోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నా అమెరికా నియంత పోకడను ఆపడం లేదని, ఇరాన్ దేశంలో అన్యాయంగా వేల మంది మరణిస్తున్నారని, లక్షల కోట్ల సంపద నాశనమవుతుందని, యుద్ధం వల్ల వివిధ దేశాల్లోని పిల్లలు, వృద్ధులు, పేదలు ఇబ్బంది పడుతారన్నని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ యుద్ధం వల్ల గ్యాస్, పెట్రోల్ వంటి నిత్యావసర సరుకులకు కొరత ఏర్పడి సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. భారతదేశ పాలకులు యుద్ధం ప్రభావాలను సరిగా అంచనా వేయలేక పోతున్నారని, అమెరికా, ఇజ్రాయిల్ దురహంకార యుద్ధం పట్ల నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి మాట్లాడుతూ ప్రపంచంలోని బలహీన దేశాలపై యుద్ధాలు చేస్తూ ఆయా దేశాల అధ్యక్షులను చంపుతూ, అక్రమంగా కిడ్నాప్ చేస్తూ ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తుందని, ప్రపంచ దేశాల మీద ఆధారపడి ఆయుధ వ్యాపారం చేస్తున్న అమెరికా అదే ప్రపంచ దేశాల మీద యుద్ధం చేయడం నీతిమాలిన చర్య అని అన్నారు. యుద్ధం మొదలు పెట్టిన అమెరికా ఆ యుద్ధాన్ని ఎదుర్కోలేక ఎలా ఆపాలో తెలియక తప్పుడు యుద్ధాన్ని కొనసాగిస్తున్నదని, యుద్ధాన్ని ఇరాన్ దీటుగా ఎదుర్కోవడమే కాకుండా యుద్ధ నష్టానికి అమెరికాపై బాధ్యత వహించాలని, భవిషత్ లో ఇలాంటి యుద్ధాలు చేయమని ఒప్పందం చేయాలని డిమాండ్ చేస్తుందని, అమెరికా అక్రమ యుద్ధం నిలిపివేయాలని ప్రపంచ ప్రజాస్వామికవాదులు నిరసనలు తెలుపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, సాయిని నరేందర్, ఎదునూరి రాజమౌళి, తాడిశెట్టి క్రాంతి కుమార్, మంద వీరస్వామి, కన్నం సునీల్, నలిగంటి చంద్రమౌళి, జన్ను పద్మ, ప్రభంజన్, గొల్లపల్లి వీరస్వామి, ఐతం నగేష్, అంబాల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇరాన్ పై అమెరికా యుద్ధం ఆపాలి -ప్రజా సంఘాల శాంతియుత నిరసన


I like the valuable information you provide in your articles. I will bookmark your weblog and check again here frequently. I am quite certain I’ll learn a lot of new stuff right here! Good luck for the next!