Headlines

నిరుద్యోగ మహిళలకు ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషిన్ పథకం’ ప్రొసీజర్ ఇలా

నిరుద్యోగ మహిళలకు ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషిన్ పథకం’

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషిన్ పథకం’ను ప్రారంభించింది. ఈ పథకం కింద బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మెషిన్లు అందజేయనున్నారు.

ఈ పథకానికి అర్హులైన మహిళలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

అర్హతలు

దరఖాస్తుదారులు కింది పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

  1. ఆధార్ కార్డు
  2. రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం
  3. కుల ధ్రువీకరణ పత్రం

దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.

దరఖాస్తు గడువు సెప్టెంబర్ 15 వరకు

అర్హులైన అభ్యర్థులు TGOBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 13, 2026 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 15, 2026 వరకు కొనసాగనుంది.

మరిన్ని వివరాల కోసం సంబంధిత జిల్లా బీసీ అభివృద్ధి అధికారి లేదా ఈడీ బీసీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

Share this post
IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం