ప్రారంభమైన సరస్వతి  పుష్కరం

saraswathi pushkaralu

డాక్టర్  జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలో  కాళేశ్వరం త్రివేణి సంగమంలో  సరస్వతి  పుష్కరాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి.
గురువారం తెల్లవారుజామున 5.44 నిమిషాలకు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర స్నానం ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యుల గండ్ర సత్యనారాయణ రావు, హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద పుష్కరస్నానాలు ఆచరించారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు సరస్వతీ నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

12 సంవత్సరాల తర్వాత సరస్వతి పుష్కరాలు గోదావరి, ప్రాణహిత అంతర్వహిని సరస్వతి త్రివేణి సంగమంలో జరుగుతున్నాయి.
15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా  భక్తులకు ఇబ్బందులు కలగకుండా  అన్ని ఏర్పాట్లు చేసిట్లు  రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు.


. శైలజా రామయ్యర్ స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం పుష్కరాలకురానున్నారు.
ముఖ్యమంత్రి చేతులమీదుగా  సరస్వతి ఘాట్ ఆవరణలో కాశి దీక్షిత్ పండితులు, స్థానిక బ్రాహ్మనోత్తముల అధ్వర్యంలో హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరస్వతి మాతా విగ్రహం తోపాటు పుష్కర ఘాట్ ప్రారంభోత్సవం చేస్తారు.
సిఎం  పుష్కర స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటారని, అనంతరం త్రివేణి సంగమంలో మొట్ట మొదటి సారిగా కాశీ పండితులు నిర్వహించనున్న  హారతిలో పాల్గొంటారని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు.
తెలంగాణ స్వ  రాష్ట్రంలో. మొట్ట మొదటిసారిగా పెద్ద ఎత్తున పుష్కరాలు నిర్వహిస్తున్నామని జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.  అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని  భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని  ఆమె సూచించారు.

మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్,  ఆంధ్రప్రదేశ్ ల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. భక్తులు  పుణ్య స్థానాలు ఆచరించేందుకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని” (అదృశ్య నది) గా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశి ( మిథునరాశి )లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఆచరిస్తారు.

బృహస్పతి దేవ గురువు . బృహస్పతి జ్ఞానం, విద్య , ఆధ్యాత్మికతకు అధిపతిగా పరిగణించబడుతున్నాడు. బృహస్పతిని గురుగ్రహం అని కూడా అంటారు. గురువు ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఒక రాశి నుంచి వెళ్లిన తర్వాత అదే రాశిలోకి అడుగు పెట్టడానికి 12 యేళ్లు పడతాయి. ఏ రాశి లో సంచరిస్తాడో ఆ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 14 న రాత్రి 10.35 గం మిథునరాశిలోకి బృహస్పతి అడుగు పెట్టనున్నాడు…

సరస్వతి నది అంతర్వాహినిగా కాళేశ్వరం దగ్గర ప్రవహిస్తుంది.. ..

2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతుందని.. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు వివరించారు. మే 15 నుంచి 26 వరకు పుష్కర కాలం ఉంటుందని వివరించారు.

గురువు మిథున రాశి ప్రవేశం అనుకూలంగా లేనివారు ప్రతి రోజూ  చదువు చెప్పిన గురువులు, మంత్రోపదేశం చేసిన గురువులు, తల్లితండ్రుల పట్ల ఆదరాభిమానాలతో వ్యవహరించడం వల్ల దుష్ఫలితాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయి…

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి