సమ్మక్క – The Glory of Medaram
(హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో స్టాల్ల్స్ నెం. 283 , 348 లో లభ్యం)
మేడారం… ఆ పేరులోనే ఒక మహాత్తు ఉంది, ఒక పులకింత ఉంది, ఒక చైతన్యo, ఒక ధిక్కారం ఉంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర నిర్వహణ జిల్లా పాలనా యంతాంగానికి ఓకే సవాల్. దాదాపు కోటికి మందికి పైగా గిరిజనులు, గిరిజనేతరులు హాజరయ్యే ఈ జాతర గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూ ప్రత్యేకత పొందింది. చిన్న అటవీ కుగ్రామంలో మౌలిక సదుపాయాలు అంతంతగా ఉన్న మేడారంలో జరిగే ఈ జాతరను గిరిజన కుంభమేళాగా అభివర్ణిస్తారు.
మతాలు వేరైనా, దేశాలు వేరైనా, పద్ధతులు వేరైనా సరే జాతరలు సహజంగా జరిగేవే.. కానీ ఏ జారతకూ లేని ప్రత్యేకతలు, అన్ని జాతరల్లో కనిపించే విశిష్టతలు మేడారంలో కనిపిస్తాయి. గలగల పారే సెలయేటిలో పుణ్యస్నానాలు చేసే కుంభమేళా లాంటి దృశ్యాలు ఇక్కడా కనిపిస్తాయి. గణగణమోగే గంటలు హిందూ దేవాలయాలు, క్రైస్తవ చర్చిలో వాతావరణాన్ని ప్రతిధ్వనిస్తాయి. కొండకోనల మధ్య జనసందోహం శబరిమలను తలపిస్తుంది. తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించే మరో తిరుమల ప్రత్యక్షమవుతుంది. యుద్ధభూమిలో నేలకొరిగిన జాతి రత్నానికి భక్తకోటి నివాళులు మేడారంలో అర్పించే మరో జకార్తా, దైవత్వం సంతరించుకున్న మానవత్వం పుట్టిన మరో జెరూసలేం. ఇవన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి. కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం, గుర్తించడం వరకు మాత్రమే ఈ జాతర పరిమితం కాదు. నమ్మిన జనం కోసం ప్రాణమైనా ఇవ్వాలనే ఓ సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుంది. యుద్ధంలో గెలిచిన కాకతీయులు సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తులయ్యారు. పోరాటం చేసిన మేడరాజులు మాత్రం దేవుళ్ళు దేవతలయ్యారు.
ఇంతటి, గొప్ప జాతర నిర్వహణలో భాగస్వామ్యం కావడం గొప్ప అవకాశం. సమాచార పౌర సంబంధాలశాఖలో 1993 లో APPSC ద్వారా సహాయ పౌర సంబంధాల అధికారిగా వరంగల్ లో జాయిన్ అయ్యాను. అప్పటినుండి, మొట్ట మొదటి సరిగా 1994 నుండి మేడారం జాతర విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాను. 2014 వరకు ప్రతీ జాతరకు ములుగు డివిజనల్ పీఆర్ఓ గా, వరంగల్ డీపీఆర్ఓ గా మేడారంలో మీడియా సెంటర్ ఇంఛార్జిగా భాద్యతలు నిర్వర్తించాను. పదోన్నతిపై హైదరాబాద్ కు వెళ్లినప్పటికీ ప్రతీ జాతరకు తప్పనిసరిగా వెళ్తూ అక్కడి జాతరలో గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలు, మొక్కులు, జాతర జరిగే తీరు, వివిధ రాష్ట్రాలనుండి వచ్చే గిరిజన జాతుల సంస్కృతీ సాంప్రదాయాలు, మీడియా కవరేజి, జాతరలో ఎదురయ్యే ఇబ్బందులు… ఇలా భిన్న అంశాలపై ఎప్పటికప్పుడు వ్యాసాలూ రాయడం చేస్తున్నాను. ఇవి వివిధ పత్రికలూ, సోషల్ మీడియాలో రావడం జరిగింది.
ఇప్పటివరకు మేడారం పై రాసిన వ్యాసాల సంకలనాన్ని *సమ్మక్క – The Glory of MEDARAM * అనే పేరుతొ ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకం ఈనెల 19 వ తేదీ నుండి 29 వరకు జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో స్టాల్ల్స్ నెం. 283 , 348 లో దొరుకుతాయి. వివరాలకు 9849905900
కన్నెకంటి వెంకట రమణ
సమ్మక్క – The Glory of Medaram-Book by వెంకట రమణ

