జూనియర్ సివిల్ జడ్జి గా సాయి పవన్

 హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన డ్యాగల సారయ్య సత్యవతి కుమారుడైన డ్యాగల సాయి పవన్ జూనియర్ సివిల్ జడ్జి సాధించి తల్లి తండ్రులతో పాటు చదువు చెప్పిన గురువులకు పేరు తెచ్చి పెట్టారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత న్యాయ వ్యవస్థపై మక్కువతో సమాజంలోని చెడును చట్టపరంగా తుడిచి వేయడంతో పాటు సామాన్యునికి న్యాయం అందేలా, నేరాలను అదుపు చేయడం కోసం పచ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఐ ఐ టి కరగ్ పూర్ లో ఎల్ ఎల్ బి హానర్స్ పూర్తి చేసిన సాయి పవన్ కొంత కాలం డిల్లీ హై కోర్టు, తీస్ హజారి జిల్లా కోర్టు, హనుమకొండ, వరంగల్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తూనే  జూనియర్ సివిల్ జడ్జి సాధించాలని పట్టుదలతో మూడు సార్లు పరీక్షలు వ్రాసి జూనియర్ సివిల్ జడ్జి పదవి సాధించాడు. నాలుగు రోజుల క్రితం తెలంగాణ పోలీసు శాఖ విడుదల చేసిన ఎ.పి.పి ఫలితాల్లో కూడా పదవిని సాధించాడు. సాయి పవన్ తండ్రి విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడుతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సాయి పవన్ నియామకం పట్ల తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు ముద్దసాని సహోదర రెడ్డి, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్, ఉపాధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిల్ల రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర కమిటి సభ్యులు జన్ను పద్మ, ఎగ్గడి సుందర్ రామ్, సహచర న్యాయవాదులు నారాయణరావు, ఇ. సత్యనారాయణ రెడ్డి, బండి మొగిలి ఎం. శ్రీనాథ్, చింత నిఖిల్, జన్ను ప్రభాకర్, సన్నీ కుమార్, రాహుల్, లోకేశ్వర్, డాక్టర్ జిలుకర శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు
Share this post
IN ARTICLE

Trending Global

భారత్ ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం