పెరిక కులస్థులు అన్ని రంగాల్లో ముందుండాలి: రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు యర్రంశెట్టి ముత్తయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెరిక కుల సంఘం నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలోని భవానీ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన పురగిరి క్షత్రియ పెరిక సంఘం జిల్లా కమిటీ ఎన్నికల కార్యక్రమంలో రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు యర్రంశెట్టి ముత్తయ్య, గౌరవ అధ్యక్షులు లక్కర్సు ప్రభాకర్ వర్మ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెరిక కులస్థులు విద్య, వైద్య, వ్యాపారం, రాజకీయాలు సహా అన్ని సామాజిక రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెరిక కుల బాంధవులు ఐక్యంగా ఉండి పరస్పర సహకారం అందించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెరిక కులస్తుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన రాజకీయ రంగంలో పెరిక కులస్థులు రాణించేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెరిక సంఘం అధ్యక్షుడిగా పినపాక మండలం కరకగూడెం గ్రామానికి చెందిన పూజారి వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా భద్రాచలానికి చెందిన యర్రంశెట్టి నరసింహారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా సుజాతనగర్ మండలం నాయకులగూడెంకు చెందిన వనపర్తి అరుణను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అలాగే పలువురిని నూతన జిల్లా కమిటీ సభ్యులుగా నియమించారు.
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు ఆక రాధాకృష్ణ, చింతం లక్ష్మీనారాయణ, సంగాని మల్లేశ్వర్, సాయిని నరేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో పెరిక కులస్థుల విద్య, వైద్య, రాజకీయ, వ్యాపార రంగాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. పెరిక కులస్థులు ఐక్యంగా ముందుకు సాగితే అన్ని రంగాల్లో బలోపేతం అవుతారని అన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన రాష్ట్ర సంఘం నాయకులు కానుగంటి శ్రీనివాస్ దంపతులు తమ దాతృత్వంలో జిల్లాలోని 41 మందికి రూ.5 లక్షల విలువైన కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన ఉపసర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి రంగారావు, డాక్టర్ కర్రె సురేందర్, రాష్ట్ర నాయకులు అంకతి ఉమామహేశ్వరరావు, అంకతి వెంకట రమణ, అంకత మల్లికార్జున రావు, శ్రీనివాసరావు, నట్టె మోహన్ రావు, తిప్పని సిద్ధులు, అత్తె నరేందర్, తుమ్మటి గంగాధర్, పల్నాటి నాగేశ్వరరావు, దిడ్డి మోహన్ రావు, బోలుగొడ్డు శ్రీనివాస్, తిప్పని శ్రీనివాస్, బండారు వెంకన్న, ఎగ్గడి నరసింహరావు, ఎగ్గడి సుందర్ రామ్ తదితరులు పాల్గొన్నారు.




Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? I’m kinda paranoid about losing everything I’ve worked hard on. Any suggestions?
**mitolyn**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.