కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన కుమార్ పల్లి వాసులు
హనుమకొండ జిల్లా కేంద్రం 8వ డివిజన్ టైలర్స్ స్ట్రీట్ రెండవ వీధి, సుధానగర్, పోచమ్మ గుడి పక్కన ప్రజా ఆరోగ్యానికి హానికరమైన సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కు ఆ వీధి ప్రజలు వినతి పత్రం ఇచ్చారు. హనుమాండ్ల కుమారస్వామికి చెందిన 3-5-34 నంబర్ గల ఇంటిపై రిలయన్స్ సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని గత 15 రోజుల నుండి కాలనీవాసులు చేస్తున్న ఆందోళనను ఎవరూ ఖాతరు చేయడం లేదని, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు విన్నవించినా టవర్ నిర్మాణ పనులను నిలిపివేయకపోవడంతో కాలనీ వాసులు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చి పనులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మించడం వల్ల పెద్దలతో పాటు చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.
వినతిపత్రం స్వీకరించిన కలెక్టర్ జనావాసాల మధ్య ప్రైవేట్ సెల్ టవర్ నిర్మాణ పనులపై విచారణ జరిపి వారిపై చర్య తీసుకొని కాలనీవాసులకు మేలు చేస్తానని అన్నారు. సెల్ టవర్ నిర్మాణించే గృహం రెండు అంతస్తులకు అనుమతి తీసుకొని అనుమతి లేకుండా నాలుగు అంతస్తుల ఇంటిని నిర్మాణం చేయడమే కాకుండా అట్టి ఇంటిపై రిలయన్స్ సెల్ టవర్ నిర్మాణం చేయడానికి అద్దెకు ఇచ్చారని తెలిపారు. సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయకుంటే ఇట్టి విషయమై ఆందోళన ఉదృతం చేయడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి, ఎం.పి కడియం కావ్యకు కూడా నివేదిస్తామని తెలిపారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో సాయం మహేష్ కుమార్, పెండ్లి సునంద్, సునీల్ రాజ్, అనురాధ, రాజు తదితరులు ఉన్నారు.
d8iad7