తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు ఉత్తర్వులు జారిచేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్రానికి నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్‌గా) రామకృష్ణారావు నియమితులయ్యారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణారావుకు సుదీర్ఘమైన పరిపాలనా అనుభవం ఉంది. రామకృష్ణారావు తన 30 సంవత్సరాల పదవీకాలంలో వివిధ శాఖలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక, పరిపాలన వ్యవహారాల్లో రామకృష్ణారావు దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. దేశవ్యాప్తంగా బహుళ రాష్ట్రాల్లో హైప్రొఫైల్ ఐఏఎస్ అధికారులలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన, తెలంగాణలో ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాల అమలులో కీలక పాత్రపోషించారు.
ఇప్పటి వరకు సీఎస్ పదవిలో ఉన్న శాంతికుమారి పదవి కాలం ముగియడంతో కొత్త సీఎస్ ఎంపిక ప్రక్రియ వేగంగా జరిగింది.
శాంతి కుమారికి కీలక పదవి ?
పదవి విరమణ చేయనున్న చీఫ్ సెక్రెటరిశాంతి కుమారికి కీలక పదవిని ఇచ్చేయోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు చర్చ జరుగుతోంది. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో శాంతి కుమారి నియమితులయ్యారు. ఆమెకన్నా మందు సోమేశ్ కుమార్ పనిచేశారు. ఆయన ఆంధ్రక్యాడర్ అధికారికావడంతో విధిలేక మద్యలోనే చీఫ్ సెక్రెటరి పదవిని వదులు కున్నారు. సోమేశ్ కుమార్ తెలంగాణ లో కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. కేంద్రం సోమేశ్ కుమార్ కు అవకాశం ఇవ్వకంపోవడంతో ఆయన చివరికి తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ లో ప్రభుత్వ సలహా దారుగా నియమితులయ్యారు. సోమేశ్ కుమార్ పై అనేక ఆరోపణలు వచ్చాయి.
కాని శాంతికుమారి తన పేరుకుతగిన రీతిలో శాంతవదనంతో తనపదవి కాలాన్ని నెట్టుకు రావడంలో మెప్పుపొందారు. అందుకే ఆమెకు కీలక భాద్యతలు అప్పగించే యోచనలో సిఎం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.


xwz1kx
888oqt
66b chính thức Một số trò chơi nổi bật tại nhà cái được cập nhật phải kể đến như Pubg, liên minh huyền thoại, CS:GO, FIFA, DOTA 2,….Mỗi trận đấu luôn được các chuyên gia nhà cái phân tích và đưa ra để anh em có cơ hội vào những kèo cược ngon, nâng cao cơ hội chiến thắng.
66b cung cấp số hotline hỗ trợ khách hàng 24/7: (+44) 2036085161 hoặc (+44) 7436852791. Tuy nhiên, do chênh lệch múi giờ, bạn nên liên hệ qua các phương thức khác như trò chuyện trực tiếp, email hoặc Zalo để được hỗ trợ nhanh chóng hơn.