Site icon MANATELANGANAA

తెలంగాణ సీఎస్‌గా రామకృష్ణారావు – ఉత్తర్వులు జారిచేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్రానికి నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్‌గా) రామకృష్ణారావు నియమితులయ్యారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణారావుకు సుదీర్ఘమైన పరిపాలనా అనుభవం ఉంది. రామకృష్ణారావు తన 30 సంవత్సరాల పదవీకాలంలో వివిధ శాఖలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక, పరిపాలన వ్యవహారాల్లో రామకృష్ణారావు దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. దేశవ్యాప్తంగా బహుళ రాష్ట్రాల్లో హైప్రొఫైల్ ఐఏఎస్ అధికారులలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన, తెలంగాణలో ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాల అమలులో కీలక పాత్రపోషించారు.

ఇప్పటి వరకు సీఎస్ పదవిలో ఉన్న శాంతికుమారి పదవి కాలం ముగియడంతో కొత్త సీఎస్ ఎంపిక ప్రక్రియ వేగంగా జరిగింది.

Share this post
Exit mobile version