మోడల్ ప్రశ్న పత్రాల సాధన ద్వారా సివిల్స్ లో విజయం సాధ్యం!
మన లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్ని కష్టాలు, ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించి మన కలను నెరవేర్చుకునే విధంగా మనల్ని మనం దృఢపరచు కోవాలని, మనలోని అంతర్గత శక్తులను ప్రేరేపించుకుని గమ్యం వైపు అడుగులు వేయాలని, సివిల్ సర్వీసెస్
ఎగ్జామ్స్ లో విజయం సాధించడానికి ప్రిలిమ్స్ తొలిమెట్టు అయితే, అందులో వచ్చే ప్రశ్నలని సరిగా అర్థం చేసుకొని ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లోంచి సరైన సమాధానాన్ని కనుక్కోవడానికి విస్త్రుత అధ్యయనమే మార్గమని,
సిలబస్ కనుకూలంగా వివిధ పాఠ్యాంశాలను చదవడం మాత్రమే కాకుండా వాటిని
సక్రమంగా గుర్తుపెట్టుకోవడం,
సరైన సమయంలో వాటిని
స్మరణ చేసుకోవడం అవసరమని, దీనికోసం
నిరంతరం వివిధ మోడల్ టెస్టులను సాధన చేయడం ద్వారా అభ్యర్థులలో
ఆత్మవిశ్వాసం, విషయ అవగాహన, పరీక్ష ప్రశ్నలని ఎదుర్కొనే వ్యూహం పెరుగుతాయని దైనంపల్లి ప్రవీణ్ అన్నారు. ఆయన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 పోటీ పరీక్షలలో విజయం సాధించి డీఎస్పీగా పోలీసుశాఖకు ఎంపికై ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతూ, సివిల్ సర్వీసెస్ 2025 పరీక్షలలో మంచి ర్యాంకు సాధించి విజేతగా నేటి తెలంగాణ యువతకు ఆదర్శంగా నిలిచాడు.



మే 24 నాడు జరగబోయే
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ ప్రయోగాత్మకంగా ప్రారంభించిన “సంకల్ప సాధన దీక్ష” లో భాగంగా ఈరోజు సైదాబాద్ బీసీ స్టడీ సర్కిల్ లో
ప్రవీణ్ కుమార్ ప్రసంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రిలిమినరీ పరీక్షల్లో అభ్యర్థులు పాటించాల్సిన వ్యూహం, పరీక్షను అర్థం చేసుకునే విధానం, ప్రశ్నలన్నీ
విశ్లేషించే తీరు, సమయపాలన లాంటి అంశాలపై ఆయన ఎన్నో విలువైన సూచనలు, తన అనుభవాలు, ఉదాహరణలతో సహా వివరించడం అభ్యర్థులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.
పరీక్ష హాల్ లో మానసిక సన్నధ్ధతే కీలకం ::
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ తెలంగాణ
యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఒక స్వప్నం అని, అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలలో శిఖరం లాంటి ఉద్యోగాలు సివిల్ సర్వీసెస్ అని, అలాంటి సివిల్ సర్వీసెస్ ని సాధించే కలని సాకారం చేయడంలో బిసి స్టడీ సర్కిల్ నాణ్యమైన శిక్షణ ని,
విజేతలైన వ్యక్తుల మార్గదర్శకత్వంలో నిర్వహిస్తూ వస్తుందని,
అందులో భాగంగానే ప్రవీణ్ ను ఆహ్వానించి ఈ ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అదే సందర్భంలో ప్రిలిమినరీ టెస్ట్ అర్హత సాధించడంలో
ఎగ్జామినేషన్ హాల్ మేనేజ్మెంట్ కీలకంగా ఉంటుందని, మూడు గంటల కాలంలో అభ్యర్థి ఎలాంటి ఆందోళనలు, అనుమానాలు, సందేహాలు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఈ ప్రశ్నలన్నీ చదివి అర్థం చేసుకుని సరైన సమాధానాలని గుర్తించడం లోనే విజయావకాశాలు ఉంటాయని, ఆటంకాలు ప్రతిబంధకాలు, కష్టాలు సాకు చెప్పి మన లక్ష్యాన్ని సాధించే క్రమంలో డీలా పడకూడదని, అలా మొక్కవోని దీక్షతో అచంచల విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడే విజయం సాధిస్తామని దానికి నిలువెత్తు ఉదాహరణ ప్రవీణ్ కుమార్ అని మామిడి హరికృష్ణ అన్నారు. స్టడీ సర్కిల్ అభ్యర్థులకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలను కూడా అందిస్తూ, ప్రతిరోజు మోడల్ టెస్ట్ ని కూడా నిర్వహిస్తూ, అభ్యర్థులలో ధైర్యాన్ని నింపుతూ, సందేహ నివృత్తి చేస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నామని, సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించడమే లక్ష్యంగా విద్యార్థులను మానసికంగా, వైజ్ఞానికంగా, మేధోపరంగా సంసిద్ధం చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

