హైదరాబాద్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరపై వెలువడిన ప్రత్యేక గ్రంథం “Goddess of Folk” ను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి డాక్టర్ డి. అనసూయ ఆవిష్కరించారు.
Kakatiya Heritage Trust ఆధ్వర్యంలో ఈ గ్రంథం ప్రచురించబడింది. కార్యక్రమం Jyothiba Phoole Praja Bhavan లో ఘనంగా జరిగింది.
ప్రఖ్యాత చిత్ర దర్శకుడు B Narsing Rao అరుదైన ఫోటోలతో ఈ గ్రంథాన్ని సంకలనం చేశారు. ట్రస్ట్ సభ్యులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు బి.పి. ఆచార్య, బి.వి. పాపారావు, రిటైర్డ్ ఎన్‌ఐటి ప్రొఫెసర్ పాండురంగారావు, కె. శ్రీధర్, రిటైర్డ్ డీజీపీ ఎం. రతన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మెడారం జాతర గిరిజన సంస్కృతి, ఆచార సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. Samakka Saralamma Jatara కు యునెస్కో నుండి ‘ప్రపంచ వారసత్వ’ (Intangible World Heritage) గుర్తింపు పొందేలా అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ట్రస్ట్ సభ్యులను కోరారు. ట్రస్ట్ చేసిన కృషిని మంత్రి అభినందించారు

