న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27, 2026:
మద్యం కుంభకోణం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేస్తూ
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది. దర్యాప్తులో కొన్ని అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, వెంటనే అప్పీల్ చేస్తామని సీబీఐ వర్గాలు తెలిపాయి.
దిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో భారీ ఊరట: కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, కవిత సహా అందరూ నిరపరాధులేనని కోర్టు తీర్పునివ్వడం సిబిఐకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
దిల్లీ మద్యం విధానం (ఎక్సైజ్ పాలసీ) కేసులో సంచలన తీర్పు వెలువడింది. రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) సీబీఐ దాఖలు చేసిన కేసులో 23 మంది నిందితులందరినీ డిశ్చార్జ్ చేసింది. దీంతో మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా అందరికీ భారీ ఊరట లభించింది.
స్పెషల్ జడ్జి (పీసీ యాక్ట్) జితేందర్ సింగ్ ఈ తీర్పు ఇచ్చారు. సీబీఐ చార్జ్‌షీట్‌లో ఆధారాలు లేకపోవడం, సాక్షులు సరిగా లేకపోవడం, కుట్ర సిద్ధాంతం నిలబడకపోవడం వంటి కారణాలతో కేసును కొట్టివేశారు. “ప్రాథమికంగా కూడా అనుమానానికి ఆస్కారం లేదు” అని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని, ఆధారాలు లేకుండా మాత్రమే ఊహాగానాలతో కేసు నడిపించారని తీవ్రంగా మండిపడింది.
కేసులో ‘సౌత్ గ్రూప్’ అని ఒక సమూహాన్ని పేర్కొన్నందుకు కోర్టు సీబీఐపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ప్రాంతీయత ఆధారంగా లేబుల్ చేసినట్లుగా ఉందని, అది సరికాదని వ్యాఖ్యానించింది. అలాగే, దర్యాప్తు అధికారి పైన శాఖాపరమైన విచారణ జరగాలని కోర్టు సిఫార్సు చేసింది.
ఈ కేసు 2021 నవంబర్ 17న దిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం చుట్టూ తిరిగింది. 2022 సెప్టెంబరు చివరికి ఈ విధానాన్ని రద్దు చేశారు. ఈ విధానంలో అవకతవకలు జరిగాయని, లైసెన్స్‌ల ద్వారా అక్రమ లాభాలు పొందారని, మనీలాండరింగ్ జరిగిందని సీబీఐ, ఈడీలు ఆరోపించాయి. దీంతో కేజ్రీవాల్‌ను 2024 మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. సిసోదియాను 2023లో అరెస్టు చేశారు. కవితను కూడా ఈ కేసులో చేర్చారు. అయితే, అందరూ బెయిల్‌పై విడుదలయ్యారు.
కోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్ భావోద్వేగంతో మాట్లాడుతూ, “ఇది స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో అతిపెద్ద రాజకీయ కుట్ర” అని అన్నారు. “నేను నిజాయితీపరుడిని, అదే నా జీవితంలో నేర్చుకున్నది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆప్ నేతలు ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసని, బీజేపీ దురాశ వల్ల జరిగిందని ఆరోపించారు.
కవిత కూడా “సత్యమేవ జయతే” అంటూ ట్వీట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసు రాజకీయ ప్రతీకారంతో నమోదైందని పేర్కొన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా “న్యూ ఇండియాలో ఆరోపణలే ఆధారాలుగా మారాయి” అని వ్యాఖ్యానించారు.
అయితే,
ఈ తీర్పు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి, తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఇది పెద్ద విజయంగా చెప్పవచ్చు. కానీ, హైకోర్టులో ఏమవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

