న్యాయవాదుల 5వ రాష్ట్ర సదస్సు విజయ వంతం చేయండి

న్యాయవాదుల 5వ రాష్ట్ర సదస్సుకు తరలి రండి

పరకాల, భూపాలపల్లి, ములుగు లో గోడ ప్రతుల ఆవిష్కరణ

భూపాలపల్లి, ములుగు బార్ అసోసియేషన్ అధ్యక్షుల పిలుపు

సామాజికన్యాయం, న్యాయవాద హక్కులు, రక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ ఎల్ పి ఎ) 5వ రాష్ట్ర మహాసభలకు న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరై సదస్సును జయప్రదం చేయాలని భూపాలపల్లి, ములుగు జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసాచారి, వేణుగోపాలచారి లు పిలుపునిచ్చారు.  ఈ నెల 20 న కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుగు ఐ ఎల్ పి ఎ 5వ రాష్ట్ర సదస్సు గోడ పత్రికలను గురువారం భూపాలపల్లి ములుగు జిల్లా కోర్టుల ఆవరణలో విడుదల చేసి వారు మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాలకు రక్షణ చట్టాలున్నాయని ప్రజల హక్కుల కోసం నిరంతరం వాదించే న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం వల్లనే న్యాయవాదులపై, జడ్జీలపై దాడులు జరుగుతున్నాయని, హత్యలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ 80 ఏండ్ల స్వతంత్ర భారత దేశంలో ఇంకా అసమానతల సమాజం కొనసాగడం శోచనీయమని వారు అన్నారు. సమాజంలో అత్యున్నత విద్యతో పాటు రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన ఉన్నత విద్యావంతులైన న్యాయవాదులు చైతన్యం చెందడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని ఆయన అన్నారు. మహిళా సమానత్వం, ఆయా వర్గాలకు సమ న్యాయం జరగాలని న్యాయవాదులతో పాటు ప్రజలను చైతన్యం చేస్తున్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిని నరేందర్ మాట్లాడుతూ పూలే, అంబేద్కర్ సిద్ధాంత పునాదితో పని చేస్తున్న ఐ ఎల్ పి ఎ మెజార్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని, సామాజిక న్యాయం కోసం కోర్టుల్లో వాదించే న్యాయ శాఖలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల న్యాయశాఖలో అత్యున్నత స్థాయికి ఎదగడానికి అణగారిన వర్గాలకు అవకాశం లేకుండా పోయిందని అన్నారు. న్యాయవాదుల వృత్తిపరమైన అభివృద్ధితో పాటు సామాజిక చైతన్యం కల్పించడం ద్వారనే బహుజన సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవచ్చని అన్నారు. సామాజిక న్యాయం కోసం ఐ ఎల్ పి ఎ చేస్తున్న పోరాటంలో న్యాయవాదులు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20 న కొత్తగూడెంలో జరుగు రాష్ట్ర సదస్సులో రాజ్యాంగ విలువలు - ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్ట్ ప్రజల హక్కులు, ఇ డబ్ల్యు ఎస్ కు లేని నిబంధన ఓబీసీ లకు ఎందుకు, మహిళా కోటాలో బహుజన కోటా, న్యాయవాద రక్షణ చట్టం అనే నాలుగు అంశాలపై జరుగు సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ హై కోర్టు జడ్జి, మాజీ జాతీయ ఓబీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, విశిష్ట అతిథులుగా కొత్తగూడెం జిల్లా జడ్జి పాటిల్ వసంత్, అదనపు జిల్లా జడ్జి ఎస్ సరిత, గౌరవ అతిథులుగా రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి టి చిరంజీవులు, కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, ఐ ఎల్ పి ఎ జాతీయ అధ్యక్షులు సుజాత కె చౌదంటే, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత,కర్ణాటక సీనియర్ న్యాయవాది ఎస్ బాలన్, సుభాస్ చంద్ర బోస్, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు లు హారవుతారని తెలిపారు. ఇట్టి సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు పంచగిరి బిక్షపతి, మెరుగు రవీందర్ భూపాలపల్లి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బల్ల మహేందర్, లైబ్రరీ సెక్రటరీ అక్షయ, స్పోర్ట్స్ సెక్రటరీ ఇందారపు శివకుమార్, పరకాల సీనియర్ న్యాయవాది పొన్నం రాజిరెడ్డి, పి.వెంకటరమణ, లక్కం శంకర్,  దొగ్గెల రమేష్, తడక సురేష్, రమేష్, పవన్ కుమార్, భూపాలపల్లి న్యాయవాదులు పుప్పాల శ్రీనివాస్, కూనూరు సురేష్, ఎదులాపురం శ్రీనివాస్, రఫీక్, చిరంజీవి, మధురాక్షి, తిరుమల, లావణ్య, వసంత, కవిత, సైండ్ల నాగరాజు, షేక్ మొయినుద్దీన్, ఆనందరావు, మడిపల్లి రజనీకాంత్, నీలం ప్రశాంత్, లతీఫ్, అనిల్, శ్రీనివాస్, రాజేందర్, కూనూరు రంజిత్ గౌడ్, ములుగు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగోజు బిక్షపతి, ఉపాధ్యక్షులు మేకల మహేందర్, ట్రెజరర్ బానోతు స్వామిదాస్, సంయుక్త కార్యదర్శి ఓరుగంటి రాజేందర్, స్పోర్ట్స్ సెక్రటరీ రాచర్ల రాజుకుమార్, ములుగు న్యాయవాదులు వెంకటేశ్వరరావు, బి చంద్రయ్య, బల్ల ప్రతాప్, రంగోజు సూర్యం, లావణ్య, మన్సూర్ అలీ, అర్చన, గౌడి శ్రావ్య, కవిత నాతి, రాజ్ కుమార్, అరుణ్ కుమార్, చిరంజీవి, విజయ్, కల్తీ కుమారస్వామి, ప్రణయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Share this post

3 thoughts on “న్యాయవాదుల 5వ రాష్ట్ర సదస్సు విజయ వంతం చేయండి

  1. Whats Going down i am new to this, I stumbled upon this I have found It absolutely helpful and it has aided me out loads. I’m hoping to contribute & help different users like its aided me. Good job.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం