హనుమకొండలో RCTA పెన్షనర్స్ డే, డైరీ ఆవిష్కరణ
RCTA భవనానికి 10 లక్షల చొప్పున నిధులు ప్రకటించిన ఎంపీ, MLA
హనుమకొండ / వరంగల్:
రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ (RCTA) ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ( జనవరి 4, 2026న ) హనుమకొండ నక్కలగుట్టలోని సంఘం కార్యాలయం ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమం RCTA వరంగల్ జిల్లా అధ్యక్షులు పులి సారంగపాణి అధ్యక్షత వహించారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
RCTA రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ రావు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.
కార్యక్రమ ప్రారంభంలో RCTA వరంగల్ జిల్లా కార్యదర్శి డా. బి. మల్లారెడ్డి కార్యదర్శి నివేదికను సమర్పించి అసోసియేషన్ కార్యకలాపాలు, సమస్యలను వివరించారు.
కడియం శ్రీహరి






మాజీ ఉపముఖ్య మంత్రి,ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు హెల్త్ కార్డుల జారీకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీలో కూడా ఈ అంశాలను ప్రస్తావిస్తానని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలోని విలువలే తన రాజకీయ జీవితానికి పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు.
తదనంతరం అధ్యక్షులు పులి సారంగపాణి మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగులకు స్వంత భవనం అవసరమని, ఆరోగ్య రక్షణకు EHS పథకం ఎంతో అవసరమని తెలిపారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, విశ్రాంత ఉపాధ్యాయులకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. RCTA భవన నిర్మాణానికి తన ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని, పదవీ విరమణ చేసినా వారి అనుభవం సమాజానికి అవసరమేనని అన్నారు. అసోసియేషన్ అభివృద్ధికి తన సహకారం కొనసాగుతుందని, భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
కడియం కావ్య
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, యూజీసీ ఎనిమిదో వేతన సంఘం అంశాన్ని ఢిల్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. అలాగే RCTA భవన నిర్మాణానికి తన నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా RCTA డైరీని ఆవిష్కరించారు.
RCTA రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పెన్షనర్లకు సంబంధించిన చట్టాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. సత్యనారాయణ రావు వరంగల్ RCTA కార్యకలాపాలను అభినందించారు.
అనంతరం 2012లో ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో RCTA అధ్యక్షులు పులి సారంగపాణి, కార్యదర్శి మల్లారెడ్డి, అసోసియేషన్ సభ్యులు, విశ్రాంత ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

