‘విలువలతో కూడిన వృద్ధి’కి కేరాఫ్ తెలంగాణ
• పారిశ్రామికాభివృద్ధికి అనుకూలం, అవకాశాల ఖని
• పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానం
• ‘జీటో కనెక్ట్ 2025’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
‘విలువలతో కూడిన వృద్ధి’కి కేరాఫ్ గా తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జీటో) హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైటెక్స్, హెచ్ఐసీసీలలో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న ‘జీటో కనెక్ట్ 2025’ను కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహాకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచన తీరు కూడా మారిందన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటన్నారన్నారు. ముఖ్యంగా వృద్ధి నైతికమైనదా, సమ్మిళితమైనదా, సుస్థిరమైనదా..? అని అధ్యయనం చేసిన తర్వాతే అడుగు ముందుకేస్తున్నారన్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తునే తెలంగాణ నిర్మిస్తోందన్నారు. తెలంగాణ అవకాశాల ఖని అని, పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత అనుకూల పరిస్థితులున్నాయని వివరించారు. ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఒక్కసారి తెలంగాణలో పర్యటించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరారు. జైన సమాజం ‘సేవా’ స్ఫూర్తిని, తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ తో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతమవుతుందన్నారు. నిజమైన యూనికార్న్ అంటే బిలియన్ డాలర్ల విలువ కాదని, లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయడమని యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, జీటో హైదరాబాద్ ఛాప్టర్ ప్రతినిధులు రోహిత్ కొఠారి, లలిత్ చోప్రా, విశాల్ అంచాలియా, బీఎల్ భండారీ, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.


Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.
slot365 login link Một ưu điểm hoàn hảo tại nổ hũ Fun 88 đó chính là giao diện vô cùng bắt mắt, đẳng cấp cùng luật chơi rõ ràng. Một số sản phẩm siêu hút chân cộng đồng cược thủ có thể kể đến như ăn khế trả vàng, kho kháu tứ linh, ngọn lửa chibi, long quy chi bảo,…
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good. https://accounts.binance.info/es-MX/register-person?ref=GJY4VW8W
888slot cam kết mang đến những chương trình ưu đãi thực tế, điều kiện rút tiền đơn giản, không gây khó khăn cho người chơi. TONY01-04H
I’ve recently started a blog, the information you offer on this site has helped me greatly. Thank you for all of your time & work. “So full of artless jealousy is guilt, It spills itself in fearing to be spilt.” by William Shakespeare.