తీర్ధ యాత్రలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు

కరీంనగర్, ఫిబ్రవరి 19, 2026:

తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చ్ 21వ తేదీ నుండి మే 21 వ తేదీ లలో 4 ప్రత్యేక ప్యాకేజీలను “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ద్వారా హైదరాబాద్ నుండి ప్రరంభిస్తున్నట్లు IRCTC టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి.వి. వెంకటేష్ మీడియా సమావేశం లో తెలిపారు. యాత్రకి సంబందించిన వివరాలు వెల్లడించారు.

ప్యాకేజీ వివరాలు:

1.దివ్యదక్షిణయాత్ర జ్యోతిర్లింగంతో (SCZBG53):(తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రవేండ్రం, తిరుచ్చి, తంజావూరు) ఈ యాత్ర మార్చ్ 21వ తేదీన ప్రారంభమై 28 వ తేదీ వరకు ఉంట్టుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14,700/- 3 ఏసీ ధర 22,300/- 2 ఏసీ ధర 28,700/- ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.

2.సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర (SCZBG55): ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్) ద్వారక (నాగేశ్వర్), సోమనాథ్ (సోమ్నాథ్), పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్). ఈ యాత్ర ఏప్రిల్ 14వ తేదీన ప్రరంభమై 24 వ తేదీ వరకు ఉంట్టుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 17,600/- 3 ఏసీ ధర 26,700/- 2 ఏసీ ధర 34,600/- ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, కామారెడ్డి ;నిజామాబాద్ ధర్మాబాద్; ముద్ఖేడ్ నాందేడ్; పూర్ణ మీదుగావెళ్తుంది.

3.అయోధ్య-కాశీ: బైద్యనాథ్ ధామ్‌ దర్శన్ యాత్ర (SCZBG56): పూరి – కోణార్క్ – బైద్యనాథ్ ధామ్ – వారణాసి – అయోధ్య – ప్రయాగ్రాజ్. ఈ యాత్ర ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమై మే 5 వ తేదీ వరకు ఉంట్టుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16,700/- 3 ఏసీ ధర 26,100/- 2 ఏసీ ధర 34,100/- ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు,నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని,దువ్వాడ,పెందుర్తి,విజయనగరం.మీదుగావెళ్తుంది.

4.హరిద్వార్‌-మాతావైష్ణోదేవి-రిషికేష్-యాత్ర:(SCZBG57):మధుర-బృందావనం-మాతా వైష్ణోదేవి-హరిద్వార్-రిషికేశ్. ఈ యాత్ర మే 12 వ తేదీన ప్రరంభమై మే 21 వ తేదీ వరకు ఉంట్టుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16,500/- 3 ఏసీ ధర 25,700/- 2 ఏసీ ధర 33,400/- ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ , జనగాం కాజీపేట పెద్దపల్లి , మంచిర్యాల్ , బెల్లంపల్లి,సిర్పూర్ కాగజ్ నగర్ బల్హర్షా , వార్ధా & నాగ్‌పూర్.మీదుగావెళ్తుంది

సౌకర్యాలు:
రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్ర భోజనం), వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితం. ప్రతి రైలు లో 705 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సావకార్యాలు సమకురుస్తారు. కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701,9281030727,9281030759లకు సంప్రదించాలని. మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రదించాలని తేలిపారు.ఈ కార్యక్రమంలో irctc టూరిజం మానిటర్స్ ప్రశాంత్, శ్రీకాంత్, ట్రావెల్ ఎజెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ నుండి దేశీయ ఎయిర్ ప్యాకేజీలు:

  1. ఒడిషా: 5రోజులు- టికెట్టు ధర 31,850/- (ఒకరికి).
  2. హిమాచల్ & పంజాబ్:. 7 రోజులు టికెట్టు ధర 45,850/- (ఒకరికి).
  3. కర్ణాటక : 6 రోజులు, టికెట్టు ధర 36,850/-
  4. అయోధ్య-కాశీ: 7 రోజులు టికెట్టు ధర 35,550/-
  5. అండమాన్ నికోబార్ 6 రోజులు టికెట్టు ధర 46,950/-
  6. కాశ్మీర్: 6 రోజులు టికెట్టు ధర:- 42590

అంతర్జాతీయ ఎయిర్ ప్యాకేజీలు:

  1. నేపాల్: 7 రోజులు టికెట్టు ధర 55,700/-
  2. శ్రీలంక: 6 రోజులు టికెట్టు ధర 62,750/- పి.వి. వెంకటేష్ అసిస్టెంట్ మేనేజర్
    ఐఆర్సిటిసి – టూరిజం

Share this post

One thought on “తీర్ధ యాత్రలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు

  1. I believe this website contains some real good info for everyone :D. “Anybody who watches three games of football in a row should be declared brain dead.” by Erma Bombeck.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం