ఐ ఎల్ పి ఎ క్యాలెండర్ ఆవిష్కరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుధీర్
భారతదేశంలో వేల సంవత్సరాల నుండి అణచివేతకు వ్యతిరేకంగా విముక్తి పోరాటాలు చేసిన త్యాగధనులు బహుజన మహానీయుల ఉద్యమ స్ఫూర్తిని అణగారిన సమాజానికి తెలియజెప్పడం ద్వారా దేశంలో సమ న్యాయం సాధించవచ్చని, సామాజిక న్యాయ పోరాటంలో బహుజన న్యాయవాదులు ముందుండాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుధీర్ లు అన్నారు. గురువారం వరంగల్ జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 2026 కాలెండర్ ను ఆవిష్కరణ చేసి వారు మాట్లాడారు. దేశ ప్రజల విముక్తి కోసం పోరాటం చేసి ఎన్నో హక్కులు సాధించిపెట్టిన మహానీయుల చరిత్రతో కాలెండర్ ముద్రించడం గొప్ప విషయమని అన్నారు. బహుజన మహావీరుల చరిత్రను న్యాయవాదులకు బోధించి చైతన్యం చేయాల్సిన అవసరముందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ చట్టం, రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన న్యాయవాదులకు దేశ వాస్తవ చరిత్ర తెలియాల్సిన అవసరముందని, న్యాయవాదులను చైతన్యం చేస్తే 90 శాతం బహుజన సమాజం చైతన్యం చెంది బహుజన రాజ్యాధికార పోరాటానికి బాటలు పడతాయని అన్నారు. ప్రపంచానికి విలువలు బోధించిన గౌతమ బుద్ధుడు, ఆధునిక భారత దేశంలో అణగారిన ప్రజలకు, మహిళలకు విద్యనందించి, సత్య బోధన చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బ్రిటిష్ కాలంలోనే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించి సామాజిక న్యాయానికి బాటలు వేసిన సాహు మహారాజ్, దేశంలో అడ్డమైన మూడాచారల వల్ల జరుగుతున దోపిడి నుండి బయటపడాలని స్వాబిమాన ఉద్యమం పునాదిగా బహుజన రాజకీయ ఉద్యమం చేసి ప్రపంచ మన్నలను పొందిన వీరుడు పెరియార్, సామాజిక అసమానతలపై యుద్ధం ప్రకటించి మెజార్టీ సమాజానికి భక్తితో పాటు విద్య బోధించి చైతన్యం చేసిన వీరుడు నారాయణ గురు, అసమానతలను తొలగించి సమసమాజ స్థాపనకు రాజ్యాంగంలో ఎన్నో హక్కులు పొందుపరచిన బాబాసాహెబ్ అంబేద్కర్, ఓటు ద్వారా బహుజన రాజ్య స్థాపనకు బాటలు వేసిన మాన్యశ్రీ కాన్షీరామ్ లతో పాటు బహుజన మహానీయులైన ఛత్రపతి శివాజీ, ఫాతిమా షేక్, సంత్ గాడ్గే బాబా, రమాబాయి, భాగ్యరెడ్డి వర్మ, రవిదాస్, సేవాలాల్ మహరాజ్, జల్కారీబాయి, బసవన్న, మారోజు వీరన్న, నంగేలి, అయ్యంకాళి, కబీర్ దాస్, సహీద్ ఉద్దంసింగ్, పూలన్ దేవి, దొడ్డి కొమురయ్య, సర్దార్ సర్వాయి పాపన్న, యోగి వేమన రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, గురు నానక్, చాకలి ఐలమ్మ, జోగేంద్ర నాథ్ మండల్, సామ్రాట్ అశోకుడు, కొమరం భీమ్, బిర్సా ముండా, వీర బ్రహ్మేంద్రస్వామి ల పోరాట చరిత్రతో పాటు కాలరాం మందిర్ సత్యాగ్రహం, మహ్మద్ సత్యాగ్రహం, బీమాకోరేగాం వీరుల చరిత్ర, అంబేద్కర్ కుల నిర్మూలన చరిత్ర, పూలే చెప్పిన గులాంగిరి చరిత్ర, మూలనివాసి న్యాయవాద న్యాయవాద దినోత్సవం, బహిష్కృత కులాల సభ, పూలే స్థాపించిన సత్య శోదక్ సమాజ్ చరిత్ర, పూనా పాక్ట్, బౌద్ధ దీక్షా దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం, మనుస్మృతి దహన దినోత్సవం, బామ్ సెఫ్ ఆవిర్భావ దినోత్సవం చరిత్రలను ముద్రించిన కాలెండర్ బహుజన దిక్సూచిగా పని చేస్తుందని, బహుజన ఉద్యమాలకు గొప్ప స్ఫూర్తిని, శక్తిని అందిస్తుందని సాయిని నరేందర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, దయాల సుధాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చిల్ల రాజేంద్రప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పంచగిరి బిక్షపతి, రాష్ట్ర కమిటి సభ్యులు జున్ను పద్మ, ఎగ్గడి సుందర్ రామ్, వరంగల్ జిల్లా కన్వీనర్ విలాసాగరం సురేందర్, హనుమకొండ, వరంగల్ బార్ ఐ ఎల్ పి ఎ కన్వీనర్లు పెండ్యాల అనిల్, పూసపాటి శ్రీనివాస్, బార్ అసోసియేషన్ నాయకులు చింత సాంబశివరావు, రమాకాంత్, శశిరేఖ, శ్రీధర్ గౌడ్, నిర్మలా జ్యోతి, అరుణ, న్యాయవాదులు మల్లయ్య యాదవ్, నరింగరావు, లడె రమేష్, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, ప్రవీణ, సంధ్య, జె జె స్వామి, భవాని ప్రసాద్, జన్ను ప్రభాకర్, జార్జ్, సాంబయ్య, పద్మ, రేష్మ, బరుపటి వినయ్, సంధ్య తదితరులు పాల్గొన్నారు


I am constantly looking online for tips that can aid me. Thank you!
Hi my family member! I want to say that this article is amazing, nice written and come with approximately all vital infos. I’d like to look extra posts like this.