హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడిన ఆయన, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో నేరుగా చర్చలు జరిపే సమయం వచ్చిందన్నారు.
రేపే మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తాం – స్పందించకపోతే పోరాటం
“రేపు ప్రధాని మోదీని కలుసుకుని ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వాలని కోరుతాం. అభ్యర్థన చేయడం మా బాధ్యత. కానీ స్పందించకపోతే కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతాం,” అని సీఎం స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి బలం చేకూర్చాలని డీసీసీ అధ్యక్షులను సూచించారు.
సోనియా, రాహుల్‌పై కేసులు పెడితే భయపడం – తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు
నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై వ్యాఖ్యానించిన సీఎం రేవంత్,
“గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలు అమూల్యం. మూతపడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందిని ఆదుకునేందుకే కాంగ్రెస్ నిధులను వినియోగించారు. ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి కూడా లేదు. అయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెడుతున్నారు,” అని తెలిపారు.
ఈ అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధానికి లేఖ రాస్తున్నామని, తెలంగాణ ప్రజలంతా గాంధీ కుటుంబంతో ఉంటారని సీఎం ప్రకటించారు.
ఉస్మానియా యూనివర్శిటీ అభివృద్ధికి భారీ నిధులు
డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్శిటీని సందర్శిస్తానని సీఎం ప్రకటించారు.
“ఓయూకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడం మా లక్ష్యం. ఎంత ఖర్చయినా నిధులు కేటాయిస్తాం,” అని ఆయన అన్నారు.
డిసెంబర్ 8, 9న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్, అలాగే 9న ‘తెలంగాణ–2047’ పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరణ జరగనున్నట్లు వెల్లడించారు.
కోటిమంది మహిళలకు చీరలు – డిసెంబర్‌లో గ్రామీణ పంపిణీ పూర్తిచేయాలి
ఇందిరమ్మ చీరల పంపిణీపై సీఎం రేవంత్ స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.
“కోటిమంది మహిళలకు చీరలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు డిసెంబర్‌లోగా పంపిణీ పూర్తిచేయాలి. మార్చిలో పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరలు అందజేయాలి,” అని చెప్పారు.
ట్రిలియన్ డాలర్ల దిశగా తెలంగాణ
“2034 నాటికి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతాం. ఈ లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది,” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


Công nghệ mã hóa dữ liệu đầu cuối tại xn88 giúp loại bỏ mọi rủi ro về rò rỉ thông tin, xây dựng một pháo đài bảo mật vững chắc cho người tham gia. TONY12-30