ఆమె కథ..కష్టాల కత!
(జె కె రౌలింగ్ జన్మదినం)
31.07.1965
మొక్కవోని పట్టుదలకు..
అలసిపోని ప్రయాణానికి..
వీడిపోని పంతానికి..
విరమించని పోరాటానికి..
ఆమె సజీవ రూపం..
నిలువెత్తు సాక్ష్యం..!
తను..
పదిహేడో ఏటనే కళాశాల నుంచి గెంటివేయబడింది..!
ఇరవై ఐదులో
తల్లిని కోల్పోయింది..!
మరో ఏడాది గడిచేపాటికి
అనుకోకుండా
గర్భం దాల్చింది..!
27 లో…పెళ్లి..
భర్త దుర్మార్గాలు..
చిత్రహింసలు..
కూతురు పుట్టింది..!
మరుసటి సంవత్సరమే విడాకులు..
తట్టుకొలేనంత
కృంగుబాటు..!
ఈలోగా 29 వచ్చేసింది..
తన కాళ్ళ మీద తనే నిలబడి జీవనం సాగించాల్సిన పరిస్థితి..పైగా ఒడిలో బిడ్డ..
అమ్మా..నా సంగతేంటని
ప్రశ్నిస్తూ..!?
30..ఇక లాభం లేదనుకుని
మరణానికి సిద్ధపడింది..
తను వెళ్లిపోతే బిడ్డ
గతేమికాను..తన కడుపున పుట్టినందుకు
తనను మించిన కష్టాలు
ఆ చిన్నారికి ఇవ్వాలా..
అయినా ఎవరో
రాసిన రాతకు..
ఇంకెవరో చేసిన
దుర్మార్గానికి
తానెందుకు బలవ్వాలి..
ఏం చెయ్యాలి..తెలిసినది..
ఊరట ఇచ్చేది రచన ఒక్కటే..
మొదలు పెట్టింది యజ్ఞం..
రాయడమే పని..
అదే వ్యాపకం..
అదే వ్యాసంగం..
అదే జీవనం..
అదే..అదే జీవితం..!
ఆ సరికి వయసు 31..
మొదటి పుస్తకం
ప్రచురణ అయింది..
ఇంకో నాలుగేళ్లలో మరో నాలుగు పుస్తకాలు..
ఉత్తమ రచయితగా అవార్డు..
42..ఆమె రాసిన పుస్తకం విడుదలైన రోజునే కోటి పది లక్షల ప్రతులు చెల్లిపోయాయి…
ఆమె పేరు ప్రపంచం మొత్తం
మారుమ్రోగిపోయింది..!
ప్రశంసలు వెల్లువెత్తాయి..!!
ఇంతకీ ఆమె ఎవరు..
జె కె రౌలింగ్..
హరీపోట్టర్ సృష్టికర్త..
ఆ ఒక్కటే పదిహేను బిలియన్ డాలర్ల వెల్లువ..
అంతులేని విలువ..!
ఈ రోజున ఆమె కథ
ఇతిహాసం కాదా..
ఎప్పటి చీకటి రోజులు..
ఎక్కడి మురికివాడలు..
ఎలాంటి గతం..
ఎటువంటి భర్త..
అంతేలేని నష్టాలు..
వెంటాడే కష్టాలు..
వీడిపోని బాధలు..
ఆత్మహత్యకు
పురిగొల్పిన పరిస్థితులు…
ఎటు చూసినా
నిశీధి.. నైరాశ్యం..నిర్లిప్తత..
భయాన్ని ధైర్యంగా..
కష్టాన్ని ఇష్టంగా..
బాధని ఆయుధంగా…
మలచుకుని సాగించిన పోరాటం..స్ఫూర్తిదాయకం..
ఎందరికో ఉత్ప్రేరకం..
నువ్వూ..ఇలాగే ఆలోచిస్తే..
అలాగే అడుగులు వేస్తే..
నీకు ఉన్న కష్టాలే
ఎందరికో ఉన్నాయని..
ఉంటాయని
గ్రహించి వాటిని జయించే మార్గం నువ్వు నిర్మించుకుంటే..
నీ దారి ఇంకెందరికో
అనుసరణీయం..
నీ పంథా ఆచరణీయం..
జీరో అనుకున్న నువ్వే ఒకనాటికి హీరో..!
సురేష్ కుమార్ ఎలిశెట్టి
విజయనగరం
9948546286
7995666286