Headlines

స్నేహమంటే ఇదేరా

స్నేహమంటే ఇదేరా..!

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో..
💐💐💐💐💐💐💐
స్నేహమంటే..

తిరుగుళ్ళు..
ఇచ్చిపుచ్చుకోడాలు..
పరిగెత్తడం..
ఒకరి కోసం
ఒకరు ఎలుగెత్తడం..
త్యాగాలు..
భోగాలు..భాగాలు..
షికార్లు..సినిమాలు..
క్లాసులు ఎగ్గొట్టడాలు..
గోడలు ఎగబాకడాలు..
స్లిప్పులు అందించుకోడాలు..!

స్నేహమంటే..

రోడ్లపై బజ్జీలు..
మురీ మిక్చర్లు..
పానీ పూరీలు..
బస్సు దొరక్కపోతే లారీలు..
ఎంగిళ్ళు తినడాలు..
ఒకే సీసాలో
నీళ్ళు (?)తాగడాలు..
కొత్తకొత్త ఆగడాలు..
ఇంటి నుంచి అమ్మ పంపిన క్యారేజీలు లాక్కొని పంచుకోడాలు..!

స్నేహమంటే

క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు..
ఇంట్లో ఒక చోటికని చెప్పి
మరో చోటుకు వెళ్ళడాలు..
పెద్దోళ్ళకు దొరికిపోతే కవరింగులు..
కొన్ని మంచి పనులు..
ఎక్కువగా వెధవ పనులు..
ఒకరి లవ్వుకు
ఇంకొకరి కోపరేషన్..
దొరికిపోతే పరేషాన్..
అప్పుడు ఇంకో
కొత్త ఆపరేషన్..!

స్నేహమంటే

ఐడియాలు..
సోషల్ మీడియాలు..
రోమియోలు..
రోడ్డు సైడు బీట్లు..
అన్నా..మావా..
భయ్యా.. బావా..
ఇలాంటి చనువైన పిలుపులు..
ఎన్నెన్నో మధురమైన తలపులు..
ఫోన్ కాల్స్..
సంకేతంగా మిస్డ్ కాల్స్..
నో ప్రొటో కాల్స్..!

స్నేహమంటే

ప్రాణం ఇచ్చే మనసు…
పట్టించుకోని వయసు..
కనిపించని ఆలుసు..
అసలు..స్నేహమే
ఓ సొగసు..
అది స్నేహం చేసే
ప్రతి ఒక్కరికి తెలుసు!

స్నేహమంటే..

ఓ కులాసా..
ధిలాసా..
భరోసా..
భిన్న రుచుల సమోసా..
విభిన్న అభిరుచుల పిపాస..

మొత్తంగా..
బంధాల సుగంధం..
అందమైన అనుబంధం..
ఆహ్లాదం పంచే సుమగంధం..
తీయనైన మకరందం..
జీవిత పర్యంతం
వెన్నంటి ఉండే..
ఓ అద్భుతం..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286
7995666286

ఇది నేను ఇటీవల రాసి పోస్ట్ చేసింది..సందర్భం గనుక
మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను..
అన్యధా భావించవద్దు..

(నిజానికి స్నేహితులకు
ప్రత్యేకంగా ఒక రోజేమిటి..
పొద్దున లేస్తే నీతో ఉండేవాడు..నీ కష్టంలో..
సుఖంలో వెన్నంటి నిలిచేవాడు..
నిజమైన నీవాడు..
స్నేహితుడు మాత్రమే)

స్నేహితుడంటే..

నీకు కష్టమొస్తే నీకంటే
ముందు కన్నీరు పెట్టుకునేవాడు..

అంతేనా..
తన కంట నీరు
నీకు కనిపించకుండా వెంటనే తుడిచేసుకుని..
నీ భుజం తట్టి..
ఇప్పుడేమి చేద్దాంరా అంటూ
నీ కష్టాన్ని పారద్రోలడానికి
నడుం కట్టేవాడు..

నువ్వు దిక్కు తోచక
కూర్చుంటే తానే దిక్కై
నిన్ను నడిపించేవాడు..

నీ ఆనందంలో తనూ కులాసా
నీ కష్టంలో తాను భరోసా..
నీ బాధలో భాగస్వామి..
అది తీర్చే అంతర్యామి..
నీ జీవితంలో సర్వాంతర్యామి..!

నీకు రోగమొస్తే తాను
వైద్యుడు కాలేడేమో..
కాని నిన్ను వైద్యుని దగ్గరకు
తీసుకెళ్ళే తోడవుతాడు..
ఆస్పత్రిలో నువ్వున్నంతకాలం
తాను తోడుంటాడు..
ఇంట్లో వాళ్ళని పంపేసి
రాత్రంతా నీ కోసం మేలుకుని
ఉండేవాడు..
రోగం బాధతో నువ్వు కలత నిద్రలోకైనా జారుకుంటావేమో..
నీ కోసం జాగారం చేసి
పొద్దున్నే నీ మంచం దగ్గర
బ్రష్ తో సిద్ధంగా ఉండేవాడు..
ఆస్పత్రి బిల్లుకు నువ్వు
జేబు తడుముకునేలోగా
అప్పు చేసి బిల్లు కట్టేవాడు..

నీ నవ్వుకు కారణం..
నీ ఆనందానికి తోరణం..
నీ కోసం నీ శత్రువుతో
తన రణం..
అవసరమైతే నీ మంచికై మరణం..!

స్నేహితుల దినోత్సవ
శుభాకాంక్షలతో..

 *_సురేష్ ఎలిశెట్టి.._*
    సీనియర్ జర్నలిస్ట్
     9948546286
     7995666286
Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE