పక్షవాత రోగానికి  వెల్లుల్లి మందు-  కర్నూలు జిల్లాలో  ఫేమస్

పక్షవాత రోగం ఒక సారి వస్తే జీవితాంతం భాద అనుభవించాల్సిందే.  రోగ తీవ్రతను బట్టి పక్షవాతం భాదిస్తుంది. జీవించినంత కాలం మంచం పైనే గడపాలి.  లేక చేతికర్ర కాని వాకర్ తో కాని నడవాలి. ఓ చెయ్యి వంకర పోయి లేదా మూతి వంకర పోయి ఇలాంటి పేషెంట్లు మనకు కనిపిస్తుంటారు.  

అల్లోపతిలో రోగి చికిత్సకు చాలా ఖర్చు అవుతుంది. ఈ వైద్యం ద్వారా జీవితాంతం వేల రూపాయలు ఖర్చు చేసి మందులు వాడాల్సిందే.

పక్షవాతం వచ్చిన వారికి పూర్తిగా నయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లోని  కర్నూలు జిల్లా నంద్యాలకు  22 కిలోమీటర్ల దూరం లోని దోర్నిపాడు మండలం ఉమాపతి నగర్ గ్రామంలో  పురాతన ఆయుర్వేద వైద్య విధానం ద్వారా పక్షవాతం రోగులను పూర్తిగా నయం చేస్తున్నారు. 

తన తాత, తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన వైద్యంతో డాక్టర్ హరిబాబు ఈ వైద్యం చేస్తున్నాడు. 

కర్నూలు నుండి నంద్యాలకు వెళ్ళే కోవెల కుంట దారిలో ఉమాపతి నగర్ నిత్యం దూర ప్రాంతాల నుండి వచ్చిన  పక్షవాత రోగులతో వారి వెంట వచ్చిన కుటుంబ సబ్యులతో రద్దీగా కనిపిస్తుంది.  ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల నుండి ఇక్కడికి చికిత్స కోసం వస్తుంటారు.

పక్షవాతం వచ్చిన వారికి ఉమాపతి నగర్ లో చేసే వైద్యం చాలా సింపుల్ గా ఉంటుంది. వెల్లుల్లి కశాయంతో పాటు ఇతర కశాయాలను  వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ వైద్య విధానం గురించి చికిత్స పొందిన వారు నయం అయిన వారు చెప్పిన వివరాల మేరకు మూడు రోజుల పాటు రోగులు వారి వెంట వచ్చిన సహాయకులతో ఉమాపతి నగర్ లో ఉండాలి. మొదటి రోజు కడుపులోకి నోటి ద్వారా కశాయాలు ఇస్తారు. రెండో రోజు మూడో రోజు చెవుల్లోను, కంట్లోను పసర్లు (మందు) పోస్తారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వెళ్ళే వారికి పాటించాల్సిన  పత్యం గురించి వివరిస్తారు. ఇట్లా మూడు నెలల పాటు పత్యం చేయాల్సి ఉంటుంది. అట్లాగే పనిచేయని అవయవాలకు మర్దన చేసేందుకు ఔషధ తైలం కూడ  ఇస్తారు. 

ఉమాపతి నగర్ లో వైద్యం చేయించుకుని నయం అయిన  వారు ఇక్కడి వైద్య విధానం గురించి చాలా గొప్పగా చెబుతారు. పెద్ద పెద్ద కార్పోరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఫలితాలు కనిపించని వారు కూడ ఇక్కడికి వచ్చి చికిత్స పొంది మెరుగైన ఫలితాలు సాధించామని చెబుతుంటారు. వైద్యం చేసిన వారు రోగుల నుండి నామ మాత్రపు  ఫీజులు  కూడ ఆశించరు.  కేవలం ఔషధ ఖర్చులు మాత్రమే తీసుకుని చికిత్స చేస్తారు.

(ఈ రోజుల్లో పేదవారికి  వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది అయినందువల్ల  ఆలాంటి వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వివరాలు పొందు పరచటం జరిగింది. ఉమాపతి నగర్ లో చికిత్స పొంది నయం అయిన వారు వారి కుటుంబ సబ్యులు చెప్పిన వివరాలు  తెల్సుకుని ఇక్కడ పొందుపరిచాం. మరింత సమాచారం తెల్సుకునేందుకు కింద ఫోన్ నెంబర్లు కూడ సేకరించి ఇచ్చాం. ఫార్వర్డ్ చేయడం ద్వారా ఇతరులకు సహాయ పడిండి )

Share this post

One thought on “పక్షవాత రోగానికి  వెల్లుల్లి మందు-  కర్నూలు జిల్లాలో  ఫేమస్

  1. obviously like your web site but you need to test the spelling on quite a few of your posts. Many of them are rife with spelling issues and I in finding it very troublesome to tell the truth on the other hand I?¦ll surely come again again.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన