పదవి విరమణ చేసిన కళాశాళల అధ్యాపకుల సంఘం- Retired Collage Teachers Association,Telangana-RCTA హన్మకొండ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా RCTA అద్యక్షులు పులి సారంగపాణి అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్.విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సత్యనారాయణ రావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

జిల్లా RCTA కార్యదర్శి డాక్టర్ బి.మల్లారెడ్డి ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టతను వివరించారు.
ఈ సందర్భంగా పదవి విరమణ తర్వాత సమాజ హితం కోసం వివిద అంశాలలో రచనలు చేస్తూ సామాజిక వికాసానికి తోడ్పడుతున్న 20 మంది అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.

గిరిజా మనోహర్ బాబు,రుద్రసాయిబాబా,డాక్టర్ రామలక్ష్మి,డాక్టర్ వీరేశలింగం,మెట్టు శ్రీనివాస్, మురలిధర్ రావు,మార్కశంకర్ నారాయణ,సనత్ కుమార్,జయ్ కుమార్,వెంకటేశ్వర్లు,డాక్టర్ దెహగాం సాంబమూర్తి,ఇమ్మడి పుల్లయ్య, సాంబశివరావు తదితరులను ఘనంగా సన్మానించారు.
RCTA రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్.విద్యాసాగర్ మాట్లాడుతూ రిటైర్డ్ కాలేజి టీచర్స్ సమాజం కోసం సమయాన్ని వెచ్చించి చైతన్య పర్చడం అభినంద నీయమన్నారు.

RCTA జిల్లా అధ్యక్షులు పులి సారంగపాణి మాట్లాడుతు తమ సభ్యుల సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇక నుండి ప్రతి ఏటా సామాజిక సేవా రంగంలో రచనలు కొనసాగిస్తున్న రిటైర్డ్ అధ్యాపకులను గుర్తించి గౌరవించే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నట్లు తెలిపారు. రిటైర్డ్ అధ్యాపకులు సమాజం కోసం తమ రచనలు కొనసాగించాలని అన్నారు.