అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో గ్రీహౌండ్స్ బలగాలు కేంద్ర కమిటీ సభ్యుడు, సీనియర్ మావోయిస్టు నేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ చనిపోయారు.
ఈ ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు కూడా చనిపోయారు. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ అలియాస్ వెంకట చైతన్య, రవి చైతన్యగా గుర్తించారు. ఆమె చనిపోయిన మావోయిస్టు నేత అప్పారావు అలియాస్ చలపతి భార్య.
మరొక వ్యక్తి వివరాలు ఇంకా గుర్తించాల్సి ఉంది. ఘటనాస్థలంలో నుంచి AK-47 రైఫిల్లు మరియు ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా కొంతమంది మావోయిస్టు నేతలు ఆ ప్రాంతంలో తప్పించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలిస్తున్నారు.
ఉదయ్ పై రూ. 25 లక్షల రివార్డు ఉంది. ఉదయ్ అలియాస్ గాజర్ల రవి అలీయాస్ గణేష్ అలియాస్ బిరుసుది తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, ఏవోబీ స్పెషల్ జోనల్ మెంబర్‌గా కొనసాగుతున్నారు.
జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్న అరుణ మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య. ఆమెపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. వెంకట రవి లక్ష్మి చైతన్య, అలియాస్ అరుణ అలియాస్ రూపీ..అరుణది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరక వాణి పాలెం. అరుణ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, ఏవోబీ సభ్యురాలిగా ఉన్నారు. అమె తమ్ముడు ఆజాద్ కొన్నేళ్ల క్రితం పాల సముద్రం ఎన్‌కౌంటర్ కాల్పుల్లో మృతి చెందారు.ఈమె తల్లి మావి నేత గతంలో మృతి చెందారు.మావో సీసీ మెంబర్ చలపతి ఈమె భర్త చంద్రబాబు అలిపిరి ఘటనలో కీలక వ్యక్తి. ఆయన శ్రీకాకుళం సమీపంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.


whoah this blog is magnificent i love reading your articles. Keep up the good work! You know, lots of people are looking around for this information, you can aid them greatly.