హనుమకొండలో జరిగిన సహకార బ్యాంకు రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆ ర్థిక స్థితి గతులు సమీక్షించి , ఎన్‌పీఏ నియంత్రణ లక్ష్యాలు, మొండి బకాయిల వసూళ్ల పై దృష్టి సారించాలని కీలక ఆదేశాలు ఇచ్చారు.
హనుమకొండ, 18 ఫిబ్రవరి 2026:
వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు యొక్క రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం హనుమకొండ కలెక్టర్ ఆఫీస్‌లో నిర్వహించింది. ఈ సమావేశానికి బ్యాంకు పర్సన్-ఇన్-చార్జ్ మరియు కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షత వహించారు.
ఈ క్రమంలో బ్యాంకు యొక్క మూలధనం, డిపాజిట్లు, పెట్టుబడులు మరియు రుణాల వసూళ్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. బ్యాంకు ఆర్థిక స్థితిగతులు, వనరుల వినియోగం, తదుపరి కార్యాచరణల పై అధికారుల మధ్య విస్తృత చర్చలు జరిగింది.
సమావేశంలో ముఖ్యంగా మొండి బకాయిల వసూళ్లపై ఎక్కువగా దృష్టి సారించాలని నిర్ణయించారు.
బ్యాంకు యొక్క ఎన్‌పీఏ (NPA) స్థాయిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన ప్రామాణిక రేటు కంటే తక్కువగా, 5 శాతం లోపు ఉంచే విధంగా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ చర్యలు తీసుకోవాలని శ్రీమతి స్నేహ శబరీష్ ఆదేశించారు.
బ్యాంకు ఆర్థిక స్థిరత్వం మరియు బలోపేతం కోసం అవసరమైన పారదర్శక చర్యలను వేగంగా అమలు చేయాలని సభ్యులకు సూచించారు.
ఈ సమయంలో బ్యాంకు సీఈఓ వజీర్ సుల్తాన్, జనరల్ మేనేజర్ ఉష శ్రీ తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

