వేశ్యలా చూసారు…మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు

Miss England

హైదరాబాద్,మే 24,25: హైదరాబాద్ లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ అంతర్జాతీయ పోటీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అర్దాంతరంగా ఈ పోటీల నుండి తప్పుకుంది. ముందు వ్యక్తిగత కారణాలు చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది.

మీరు మిస్ వరల్డ్ 2025 పోటీల సందర్భంగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు భారత్ లోను ఇతరదేశాలలోను చర్చనీయంగా మారింది. హైదరాబాద్‌లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిల్లా మాగీ మే 16, 2025న వ్యక్తిగత కారణాలు చెప్పి తప్పుకున్నారు. అయితే, ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లిన తర్వాత, ఆమె బ్రిటిష్ పత్రిక “ది సన్”కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. పోటీల్లో తమపై మధ్య వయస్కులైన పురుషులను ఆనందపరచమని ఒత్తిడి తెచ్చారని, తనను వేశ్యకంటే అధ్వాన్నంగా చూశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగు మరియు జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి, పోటీల నిర్వాహణపై విమర్శలు రేకెత్తించాయి.

మిస్ వరల్డ్ సంస్థ ఈ ఆరోపణలను ఖండించింది. సంస్థ ఛైర్‌పర్సన్ జూలియా మోర్లీ మే 24, 2025న ఒక ప్రకటన విడుదల చేసి, మిల్లా వ్యక్తిగత కారణాల వల్ల (తల్లి ఆరోగ్య సమస్యలు) తప్పుకున్నారని, ఆరోపణలు నిరాధారమని, పోటీలు “బ్యూటీ విత్ ఎ పర్పస్” విలువలతో నిర్వహించబడుతున్నాయని స్పష్టం చేశారు. మిల్లా తప్పుకోవడంతో, రన్నరప్ షార్లెట్ గ్రాంట్ ఇంగ్లాండ్ తరపున పోటీలో పాల్గొంటున్నారు.

ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం నిర్వహణపై అనుమానాలు మిగిలిపోతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పోటీలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయి, 108 దేశాల నుంచి పోటీదారులు పాల్గొంటూ, మే 31, 2025న హైదరాబాద్‌లో ఫైనల్ ఈవెంట్ జరగనుంది.

అందాల పోటీలలో మహిళలను కించపరిచారని పోటీదారులే ఆరోపిస్తుంటే ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రశ్నించారు. మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా ఆరోపణలు ప్రస్తావిస్తూ అందాల పోటీల్లో పాల్గొనే వారిని వేశ్యల్లా చూస్తున్నారని ఆమె తెలిపిందని నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికైనా అందాల పోటీలపై మాట్లాడే వారు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. తనపై వెటకారంగా విమర్శలు చేసిన వారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. అందాల పోటీలు నిర్వహించడమంటేనే మహిళలను కించపర్చడమని నారాయణ అన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE