జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డితో శాంతి కమిటి భేటీ

హైదరాబాద్‌, ఏప్రిల్ 27: మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఆదివారం శాంతి చర్చల కమిటీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, మాజి మావోయిస్టు నేత జంపన్న, రవి చందర్ హాజరయ్యారు.

కమిటీ నేతలు కేంద్రాన్ని కాల్పుల విరమణకు ఒప్పించాలని, మావోయిస్టులతో చర్చలకు మార్గం సుగమమం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందిస్తూ, “తమ ప్రభుత్వం నక్సలిజాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా, ఒక సామాజిక అంశంగా చూస్తోంది,” అన్నారు.

గతంలో నక్సలైట్లతో కాంగ్రేస్ పార్టి చర్చలు నిర్వహించిన అనుభవం ఉందని తమపార్టి సీనియర్ నేత జానారెడ్డి సలహాలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులతో చర్చించిన తరువాత, ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Share this post

One thought on “జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డితో శాంతి కమిటి భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం
కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల