మధుమేహులకు గోధుమ రొట్టెల కన్నా జొన్న రొట్టెలు మిన్న

మధు మేహంతో భాదపడే వారు గోధుమ రొట్టెల కన్నా జొన్న రొట్టెలు తింటే మేలు.గోధుమల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ పదార్థం ఉంటుంది.ఇది కొందరికి సరి పడక తీవ్రమైన గ్యాస్ సమస్య ఏర్పడడంతో కడుపు నొప్పివంటి భాదలకు గురవుతుంటారు.అంటే వీరికి గ్లూటెన్ ఎలర్జి ఉందని అర్దం చేసుకోవాలి.జొన్న రొట్టెలో పోషకాలు ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి.జొన్న రొట్టెల్లోఎక్కువగా ఉండేది కాల్షియం.ఇనుము,ప్రోటీన్లు,పీచు పదార్ధాల్లాంటి పోషకాలుకూడా వీటిలో ఎక్కువే.
శరీరంలో ఉండే చెడు కొవ్వు తగ్గించే శక్తి జొన్నగింజల్లో ఉంది. ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ ఒక కప్పు జొన్నల్లో లభిస్తుంది. నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నలకు ఉంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు జొన్నలు ఎక్కువగా వాడటం వల్ల తగ్గుతాయి. జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణశక్తిని పెంపొంది, అందుకు అవసరమైన హార్మోన్లను వృద్ధి చేస్తాయి.
రొట్టెలు  తయారు చేయడం ఎలా ?
కావల్సిన పదార్థాలు: జొన్న పిండి – 100 గ్రాములు, ఉప్పు – తగినంత, నీరు – తగినంత.
తయారుచేసే విధానం: జొన్న పిండిని జల్లించి, ఉప్పువేసి గోరు వెచ్చని నీటితో కలిపి ముద్దగా చేసుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక్కొక్క ఉండను కొంచెం నీరు చల్లుతూ వేళ్ళతో నొక్కుతూ బాగా కలపాలి. పీటమీద పొడి పిండి చల్లుకొని, ఈ ఉండలను చుట్టూ తిప్పుతూ అరచేతితో గుండ్రంగా నొక్కాలి. పిండిని జల్లించి, ఉండను బాగా నొక్కితే అంచు పగలకుండా ఉంటుంది. పెనం కాలిన తర్వాత రొట్టెను పెనం మీద వేయాలి. రొట్టె కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా నీరు చల్లి, బట్టతో నొక్కి రెండవ వైపుకు తిప్పుతూ కాల్చాలి. రొట్టె వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share this post

2 thoughts on “మధుమేహులకు గోధుమ రొట్టెల కన్నా జొన్న రొట్టెలు మిన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు