హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గ సబ్యులు, టి ఎన్ జి ఒ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పుల్లూరి వేణుగోపాల్ కు హనుమకొండ జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలో బెస్ట్ సోషల్ అక్టీవిస్ట్ గా ప్రశంసా పత్రం అందించారు. హనుమకొండ జిల్లా కేంద్రం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం జరిగిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో హనుమకొండ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు స్నేహ శబరీష్ చేతుల మీదుగా ఆయన ప్రశంస పత్రం స్వీకరించారు.
ఈసందర్బంగా పుల్లూరి వేణు గోపాల్ మాట్లాడుతూ ఈ ప్రశంస పత్రం ద్వారా సామాజిక బాధ్యత మరింత పెరిగిందని అందరి సహకారంతో రాబోవు రోజుల్లో సమాజ సేవలో ముందుంటానని తెలిపారు. ఆల్ ఇండియా ఒబిసి జాక్ వ్యవస్థాపక చైర్మన్ సాయిని నరేందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి క్రాంతికుమార్, కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు పుల్లూరి సుధాకర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఛైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్, టీ ఎన్ జి ఓస్ యూనియన్ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, గౌరవ అధ్యక్షులు శ్యాంసుందర్, గెజిటెడ్ ఉద్యోగ సంఘ నాయకులు ఈగ వెంకటేశ్వర్లు, కోలా రాజేష్, న్యాయవాదులు చిల్ల రాజేంద్ర ప్రసాద్, ఎగ్గడి సుందర్ రామ్ తదితరులు వేణుగోపాల్ కు అభినందనలు తెలిపారు.