ప్రపంచాన్ని అందంతో కాదు – సేవతో మెప్పిస్తున్న మిస్ వరల్డ్ సంస్థ
లండన్ లో మొదలై ప్రపంచదేశాలకు విస్తరించిన మానవతా ప్రయాణం
అందాల పోటీ అంటే చాలా మందికి ధగధగ మెరిసేవిద్యుత్ కాంతుల మధ్య రాంపులపై హొయలొలుకుతూ తల తల మెరిసే అందాల భామలు కనిపిస్తారు. కానీ మెరుపుల ప్రపంచం వెనకాల మరో ప్రపంచం ఉంది. అందాల రాంపు ఆవలివైపు ఎవరికి తెలియని ఒక గొప్ప మానవతా సిద్ధాంతం దాగి ఉంది.
1951లో బ్రిటన్‌కు చెందిన ఎరిక్ మోర్లే స్థాపించిన ఈ అందాల భామల పోటీ, కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం ఎరిక్ మోర్లే భార్య జూలియా మోర్లే దీనిని నడుపుతున్నారు. ఆమె నాయకత్వంలో మిస్ వరల్డ్ పోటీ “అందం సేవకు (Beauty with a Purpose)” అనే సంకల్పంతో సాగుతోంది.

‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ – సేవే అందం!
మిస్ వరల్డ్ పోటీకి ప్రత్యేకత తీసుకువచ్చింది ఈ ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ మిషన్. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచం నలుమూలలలోని మిస్ వరల్డ్ విజేతలు ఇంకా పోటీదారులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
భారతదేశం లోని అనాథ పిల్లల విద్య కోసం మిస్ వరల్డ్ 2017 గెలిచిన మనుషి చిల్లర్ అనేక సేవా కార్యక్రమాలు అమలు చేసింది.
మనుషి చిల్లర్ 2017లో మిస్ వరల్డ్ కిరీటం గెలిచారు.
ఆమె భారతదేశానికి చెందినవారు.
అందులో భాగంగా, ఆమె “Beauty with a Purpose” అనే కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఆ సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆమె భారతదేశంలోని పేద పిల్లల (అనాథలు, ఆర్థికంగా వెనుకబడిన వారు) కోసం విద్యను అందించేందుకు ప్రయత్నించారు.
ఉదాహరణకి:
- గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు అవకాశాలు లేని పిల్లల కోసం స్కూల్స్‌లో ప్రాజెక్టులు ప్రారంభించారు
- విద్యా సామగ్రి (పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు మొదలైనవి) అందజేశారు
- కొందరికి స్కాలర్షిప్‌లు కూడా ఏర్పాటు చేశారు

ఆమె ఈ సేవా కార్యక్రమాల ద్వారా “అందం అంటే సేవ చేసే మనసు” అనే విషయం చాటిచెప్పారు.
ఆఫ్రికాలో ఎడ్యుకేషన్ మరియు హెల్త్‌కేర్ ప్రాజెక్టులకి మిస్ వరల్డ్ టీమ్ భారిగా విరాళాలు సమకూర్చుతుంది.
లాటిన్ అమెరికాలో పోషణ లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక ఫుడ్ క్యాంపెయిన్లు చేపట్టి అమలు చేస్తున్నది.
ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా సుమారు 100+ దేశాల్లో సేవా కార్యక్రమాలు అమలయ్యాయి. అనేక మంది పిల్లలకు విద్య, మహిళల ఆరోగ్య పరిరక్షణ అమలు చేస్తున్నారు.
అందం మాత్రమే కాదు, మానవతా హృదయం కూడా
ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే, మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అందాల భామలు తర్వాత ఒక సెలబ్రిటీ లైఫ్‌కి కాకుండా, సేవా మార్గాన పయనిస్తారు. వారు ఆయా దేశాలలో మహిళల సమస్యలపై అవగాహన కల్పించడం, ప్రభుత్వాలతో కలిసి నూతన మార్గాలు అన్వేశించడం చేస్తారు.
జూలియా మోర్లే సృష్టించిన ఈ మార్గం, ‘అందం’ అంటే కేవలం శరీర రూపం కాదు – అది హృదయం, ఆలోచన, శ్రమతో కూడి ఉండాలనే సందేశాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది.
మనసున్న వారికి మిస్ వరల్డ్ మరో సేవా నిరతి అర్దం అవుతుంది.


xb8ase
ypf0m7
What i don’t realize is actually how you’re now not actually a lot more well-liked than you may be right now. You are so intelligent. You already know thus significantly in the case of this subject, made me individually imagine it from numerous various angles. Its like women and men don’t seem to be interested except it is one thing to do with Woman gaga! Your own stuffs excellent. Always handle it up!
Thanks for the marvelous posting! I really enjoyed reading it, you are a great author.I will be sure to bookmark your blog and will come back from now on. I want to encourage you to definitely continue your great posts, have a nice weekend!
I’ll immediately grab your rss as I can’t find your e-mail subscription link or newsletter service. Do you’ve any? Please allow me understand in order that I may just subscribe. Thanks.